
గుప్తుల పరిపాలన వ్యవస్థ
Indian History in Telugu
గుప్తులు భారతదేశాన్ని క్రీ.శ. 280 నుండి 550 వరకు పరిపాలించారు. ఈ కాలాన్నే చరిత్రకారులు స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. గుప్త రాజ్యంలో రాజు సర్వధికారిగా ఉండేవాడు. రాజ్యాధికారం వంశపారంపర్యంగా వచ్చే సాంప్రదాయం ఉండేది. రాజు తన పాలనను సులభతరం చేసుకోవడానికి మంత్రులను నియమించుకునేవారు. గుప్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు ద్వారా లభించేది. సైనిక దళంలో పదాతిదళం, అశ్విక దళం, హస్తి దళాలుండేవి.
➺ ప్రాంతీయ పాలన :
గుప్తు రాజులు పరిపాలించే ప్రాంతాన్ని భుక్తి లేదా దేశ అని పిలిచేవారు. భుక్తి పరిపాలించే అధికారిని ‘ఉపరిక’ అని, ‘దేశ’ అధికారిని ‘గోప్త్రి’ అని పిలిచేవారు. ప్రాంతాలను విషయాలుగా, విషయాలను మండలాలు / భోగాలుగా విభజించేవారు. చివరి పాలన ప్రాంతంగా గ్రామం ఉండేది. విషయాలకు అధిపతి విషయాధిపతి అనే వారు. విషయపతి కిందిస్థాయి అధికారులను కుమారామాత్యులని, ఆయుక్తులని పిలిచేవారు. గ్రామ స్థాయిలో పనిచేసే అధికారులను గ్రామిక, భోజకా అని అనే వారు.
➺ రెవెన్యూ పరిపాలన :
గుప్తుల కాలంలో ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. 1/6 వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. వ్యవసాయానికి అనువైన భూమిని ‘క్షేత్రం’ అనేవారు. నివాసానికి వినియోగించే భూమిని ‘వస్తి’ అని, అటవీ సంపదకు ఉపయోగించే భూమిని ‘అప్రహత’ అని, వినియోగంలో లేని వ్యవసాయ భూమిని ‘ఖిలం’ అని పిలిచేవారు. ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయక అనే వారు.
➺ సాంఘిక పరిస్థితులు :
గుప్తుల కాలంలో పితృస్వామ్య ఉమ్మడి వ్యవస్థ ఉండేది. స్త్రీలకు ఆస్తి హక్కు, సమానత్వం ఉండేది కాదు. బాల్య వివాహాలు ఎక్కువగా చేసేవారు. దేవదాసీ వ్యవస్థ అమలులో ఉండేది.
0 Comments