
గుప్తుల కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు
భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పే గుప్తుల కాలంలో నాలుగు వర్ణాలతో పాటు ‘చండాలులు’ అనే పంచమ వర్ణం నూతనంగా ఆవిర్భవించింది. వీరు బ్రాహ్మణులకు దానం చేయడానికి అగ్రహారాలు నిర్మించారు. వీరికాలంలో స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ ఉండేది కాదు. బాల్యవివాహాలు, సతీసహగమనం, ఒకరికంటే ఎక్కువ భార్యలను చేసుకోవడం వంటి ఆచారాలు కొనసాగేవి. ఉన్నత స్థాయిలో ఉన్న స్త్రీలను పురుషుల వివాహం చేసుకోవడాన్ని ధర్మశాస్త్రాలు నిషేదించేవి. గుప్తుల కాలం నాటి సామాజిక పరిస్థితులను ఎరాన్, భితారి, ఇండోర్ శాసనాల్లో లిఖించబడ్డాయి.
➺ ఆర్థిక విధులు :
భూములను దానం చేయడంతో రాజు భూమిపై హక్కు కోల్పొయే పరిస్థితి వచ్చింది. దీంతో భూస్వామ్య వ్యవస్థ రూపుదిద్దుకుంది. రైతులపై హిరణ్య, క్లిప్త, ఉపక్లిప్త, అమ్మకపు పన్నులు వేసేవారు. గుప్తుల కాలంలో భూములను మూడు రకాలుగా విభజించారు. వ్యవసాయానికి పనికివచ్చే భూములను ఖిల్లాలుగా, నివాస యోగ్యమైన భూములను క్షేత్రాలుగా, అటవీ భూములను స్థలాలలుగా విభజించారు. వీరి కాలంలో కంస, సిక్క అనే నాణెలు చలామణిలో ఉండేవి.
➺ వర్తక వాణిజ్యం :
గుప్తుల కాలంలో ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాలకు చెందిన వారితో వర్తక వాణిజ్యం నడిపేవారు. అరికమేడు, ముజ్రిస్, కావేరి రేవు పట్టణాల ద్వారా వాణిజ్యం జరిగేది. వీరి ఎక్కువగా తమ వ్యాపార అభివృద్ది కొరకు పర్షియా, అరేబియా, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాల నుండి గుర్రాలను దిగిమతి చేసుకునేవారు.
➺ మతం :
గుప్తుల కాలంలో విగ్రహారాధన జరిగేది. వైధిక మతం పునరుద్దరణతో పాటు క్రతువులు, యజ్ఞయాగాలు నిర్వహించేవారు. వైష్ణవం, శైవం, జైన మతం, బౌద్ద మతాలు ఆచరణలో ఉండేవి. దశావతారాలు, త్రిమూర్తునలు పూజించేవారు. మూఢనమ్మకాలు అధికంగా ఉండేవి.
➺ సాహిత్యరంగం :
గుప్తుల కాలాన్ని సాహిత్యానికి స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. గుప్తు రాజు అయిన సముద్రగుప్తుడు స్వీయ రచనలు చేసేవాడు. దీనివల్ల ఇతనికి ‘కవి రాజు’ అనే బిరుదును పొందాడు. 2వ చంద్రగుప్తుని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే 9 మంది కవులు పనిచేసేవారు. ఇందులో కాళిదాసు ముఖ్యుడు.
0 Comments