
Lala Lajpat Rai Biography in Telugu | లాలాలజపతిరాయ్ | Indian History in Telugu
లాలాలజపతిరాయ్ భారత స్వతంత్ర పోరాటంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన నాయకులలో ముందు వరసులో ఉంటాడు. లజపతిరాయ్ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో గల ధుడికె గ్రామంలో 28 జనవరి 1865 న జన్మించారు. భారత చట్టాన్ని సమీక్షించడానికి 1919లో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా పోరాడి అనేక లాఠీ దెబ్బలు తిన్నాడు. ఇందుకు ఇతనికి ‘పంజాబ్ కేసరి’ అనే బిరుదు వచ్చింది. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన లజపతిరాయ్ 1892లో పంజాబ్ హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు. స్వామి దయానంద సరస్వతి 10 ఏప్రిల్ 1875లో స్థాపించిన ఆర్య సమాజ వ్యవస్థాపక సభ్యులలో ఒకడిగా ఉండడమే కాకుండా ఆర్య సమాజాన్ని విసృతం చేయడంలో క్రీయాశీల పాత్ర పోషించాడు. తన యొక్క రచనలు, పత్రికల ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇందులో భాగంగా 1907లో పంజాబ్‌లో రైతు ఉద్యమాలను నిర్వహించినందుకు ఇతనిని మాండలే (బర్మా) కు తరలించారు. 1909 తిరిగి వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.
నిత్య జీవితంలో హిందీ భాష ఉపయోగాన్ని ప్రోత్సహించిన మొదటి భారతీయ నాయకుడు లాలాలజపతిరాయ్. ఏ.వో హ్యూమ్ రచించిన ఎన్ ఓల్డ్ మ్యాన్స్ హోప్ - స్టార్ ఇన్ ది ఈస్ట్ అనే గ్రంథం ద్వారా ప్రభావితమైన లజపతిరాయ్ భారత కార్మికోద్యమానికి నాయకత్వం వహించాడు.
1904లో లార్డ్ కర్జన్‌చే చేయబడిన విశ్వవిద్యాలయ చట్టమును వ్యతిరేకించారు. జోసఫ్ మాజీనీని తన రాజకీయ గురువుగా పేర్కొన్నాడు. లాహోర్‌లో నేషనల్ స్కూల్‌ని ఏర్పాటు చేశారు.
1920 కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు మరియు 1920లో ఎన్.ఎం జోషి స్థాపించిన భారత్‌లో అతిపురాతన ట్రేడ్ యూనియన్ సంస్థ అయిన ఏఐటియుసి(ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్)కి అధ్యక్షత వహించాడు. భారత ఆర్థిక రంగానికి ఊతం అందించేందుకు 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను స్థాపించాడు. లాల్`బాల్`పాల్ త్రయం (లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్) లో ముఖ్యుడిగా ఉన్నాడు. లాలాలజపతిరాయ్ 17 నవంబర్ 1928న తుదిశ్వాస విడిచారు.
➺ గ్రంథాలు :
- ది స్టోరీ ఆఫ్ మై డిపోర్షన్
- ఆర్యసమాజ్
- ది యునైటేడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా`ది హిందూ ఇంప్రెషన్
- అన్‌హ్యాపి ఇండియా
- అప్సనా-ఇ-బర్మా, ఆటోబయోగ్రఫికల్ రైటింగ్స్
- ఇంగ్లాండ్ డెబ్ట్ టు ఇండియా
➺ పత్రికలు :
- వందేమాతరం
- ది పుపిల్
- ది పంజాబ్
➺ సంస్థలు :
- సర్వేంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ - లాహోర్
- ఇండియన్ హోమ్ రూల్‌లీగ్ - న్యూయార్క్
- ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - న్యూయార్క్
➺ బిరుదులు :
- పంజాబ్ కేసరి
- పంజాబ్ సింహం
0 Comments