పల్లవుల కాలనాటి మత పరిస్థితులు | Indian History in Telugu

Pallava Dynasty Administrative system

పల్లవుల కాలనాటి మత పరిస్థితులు

Indian History in Telugu 

మత పరిస్థితులు : 

పల్లవులు ప్రధానంగా శైవ మతస్థులుగా ఉండేవారు. కానీ కొంతమంది పల్లవ రాజులు వైష్ణవ మతాన్ని స్వీకరించారు. శైవ మత సన్యాసులను ‘నాయనార్‌’లు అని, వైష్ణవ మత సన్యాసులను ‘అళ్వార్‌’లు అని పిలిచేవారు. 63 మంది నాయనార్‌లు కలిసి వ్రాసిన తమిళ గ్రంథం ‘తేవరం/తిరుమురై’. దీనినే ద్రావిడ వేదంగా పేర్కొంటారు. తిరువ మణిక్కసాగర్‌ అను శైవ మత సన్యాసి ‘తిరువసగం’ అనే తమిళ గ్రంథాన్ని లిఖించాడు. 12 మంది అళ్వారులు కలిసి ‘నలయిర దివ్య ప్రబంధం’ అనే గ్రంథాన్ని రచించారు. రెండో నందివర్మ కాలంలో తిరుమంగై అల్వార్‌ ‘తకువప’ లో విష్ణు దేవాలయం నిర్మించినట్లు ‘తకువప శాసనం ’ ద్వారా తెలుస్తుంది. పల్లవుల కాలంలో  తిరుపతి, శ్రీరంగం, కాంచీపురం ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉండేవి. 


Also Read :

Pallava Dynasty in Telugu 


Also Read :



Post a Comment

0 Comments