
పల్లవుల కాలంనాటి వాస్తు- శిల్పకళ :
Pallava Art and Architecture
భారత వాస్తు శిల్పకళా చరిత్రలో పల్లవుల యుగం ఒక అత్యున్నత శకమని సుప్రసిద్ద చరిత్రకారుడైన ‘వి.ఎ.స్మిత్’ అభివర్ణించాడు. పల్లవుల కాలంలో శిల్పులు నూతన శిల్పకళను అవలంభించారు. పల్లవుల కాలంలో వాస్తు-శిల్పకళారీతి నాలుగు దశలుగా పేర్కొనవచ్చు.
మొదటి దశ
➺ మహేంద్ర శిల్ప పద్దతి :
మొదటి మహేంద్రవర్మ కాలం నుండి శిల్పులు కొండలను తొలిచి ఆలయాలను నిర్మించారు. దేవాలయం అను పదానికి బదులు ‘మండపం’ అనే పదాన్ని వాడేవారు. సువిశాల మండపాలు, విశాలమైన స్తంభాలతో మొదటి మహేంద్రవర్మ స్వయంగా ఎటువంటి ఇటుకలు, వెదురు, లోహాన్ని ఉపయోగించకుండా త్రిమూర్తి ఆలయాన్ని నిర్మించాడు. ఈ విషయాన్ని తాను లిఖించిన ‘మండగపట్టు శాసనంలో పేర్కొన్నాడు.
మొదటి మహేంద్రవర్మ నిర్మించిన ఆలయాలు
- పంచపాండవ గుహాలయాలు
- మల్లేశ్వరాలయం
- మండప్పగట్టు ఆలయం
- పల్లవరం గుహాలయం
- రంగనాథ స్వామి ఆలయం
- భైరవకొండ శివాలయం
- సిత్తనవసల్ శివాలయం (ఫ్రెస్కో పెయింటింగ్)
రెండవ దశ
➺ మామల్ల శైలి :
మొదటి నరసింహవర్మ లేదా మామల్ల కాలంలో మహాబలిపురంలో అద్భుతమైన ఏకశిలానిర్మాణాలు/రాతిరథాలు) నిర్మించారు. మహాబలిపురంలో మొత్తం ఏడు రాతిరథాలు/పగోడాలు నిర్మించారు. ధర్మరాజ రథాన్ని మూడు అంతస్థులలో చతురస్రాకారంలో ద్రావిడ పద్దతిలో నిర్మించారు. దీనిని ద్రావిడ శైలికి తొలి నమూనాగా పేర్కొంటారు. మహాబలిపురంలో ‘పంచపాండవవరథాల్లో’ ధర్మరాజుకి, భీమునికి, అర్జునికి, ద్రౌపదికి, సహాదేవునికి 5 రథాలను నిర్మించారు. ద్రౌపది, కుంతికోసం మరో రెండు రథాలు చెక్కబడ్డాయి. ఇందులో ధర్మరాజ రథం అన్నింటి కన్నా పెద్దది.
మూడవ దశ
➺ రాజసింహ శైలి :
రెండో నరసింహవర్మ కాలంలో దేవాలయాల నిర్మాణం అత్యున్నత స్థాయికి చేరింది. రెండో నరసింహవర్మ కాలంలో రాజసింహపవ్వల శైలిరీతితో దేవాలయాలు, గుహాలు నిర్మించారు. ఈశ్వర దేవాలయం, ముకుంద దేవాలయం, తీర దేవాలయం ద్రవిడ శైలిలో రెండో నరసింహవర్మ మహాబలిపురంలో నిర్మించాడు.
రెండో నరసింహవర్మ కట్టించిన దేవాలయాలు
- తీరదేవాలయం
- ఈశ్వర ఆలయం
- ముకుంద ఆలయం
- పనమలై ఆలయం, కైలాసనాథ ఆలయం
- వైకుంఠ పెరుమాల్ (కాంచీపురం) ఆలయం
తీర దేవాలయం
ఈ దేవాలయాన్ని సముద్రతీరానికి దగ్గరలో నిర్మించారు. ఇందులో శివుని, విష్ణువుల విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి. ఈ దేవాలయాన్నే ‘త్రిమూర్తి కోవెల్’ అని అంటారు. దీనిలోని క్షత్రియ పల్లమేశ్వర విగ్రహం, రాజసింహ పల్లమేశ్వర విగ్రహం, నరపతి సింహ పల్లమేశ్వర విగ్రహం ఉన్నాయి. గర్భగృహంపై శిఖరం కల్గిన తొలి దేవాలయం ఇదే.
కైలాసనాథ దేవాలయం (కంచి)
దీనిని మూడో మహేంద్రవర్మ పూర్తి చేశాడు. దీనిలో 3 వేరు వేరు భాగాలున్నాయి. గోపుర ఆకారంలో భుజస్తంభం గల గర్భ గుడి, మండపం, దీర్ఘచతురస్రాకారంలో ఉన్న సభాప్రాంగణం.
నాల్గవ దశ :
పల్లవుల కాలంనాటి నాల్గవ దశలో దేవాలయాల నిర్మాణం తగ్గుముఖం పట్టింది. ఈ కాలంలో చిన్న చిన్న దేవాలయాలు నిర్మించారు. నంది వర్మ నిర్మించిన వైకుంఠ పెరుమాళ్ (విష్ణుమూర్తి) ఆలయంను రాజసింహ శైలిలో నిర్మించారు. ఈ దేవాలయంలో 4 అంతస్థులతో కూడిన గర్భగృహం కల్గి ఉంది. దీనిని ఇసుక, గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ఈ దేవాలయంలో ‘బంగారు బల్లి’ ని తాకడానికి ప్రదర్శిస్తారు. నంది వర్మ అనంతరం అపరాజితవర్మ కాలంలో విరాటేశ్వర(అరుత్తని) ఆలయాన్ని నిర్మించారు.
నందివర్మ నిర్మించిన దేవాలయాలు
- ముక్తేశ్వర ఆలయం (కంచి)
- తిప్రురాంతకేశ్వర ఆలయం (కంచి)
- మాతంగేశ్వర ఆలయం (కంచి)
- వాడమల్లేశ్వర ఆలయం (ఆర్గాదమ్)
- పరుశురామేశ్వర దేవాలయం (గుడిమల్లం)
0 Comments