
పల్లవ సామ్రాజ్యం Pallava Dynasty in Telugu | Indian History in Telugu | History in Telugu
పల్లవులు క్రీ.శ 6వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. శాతవాహనుల పరిపాలన అనంతరం దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి కాంచీపురం రాజధానిగా రాజ్యపాలన కొనసాగించారు. చరిత్రకారుల్లో పల్లవుల ఉనికి గురించి ఏకాభిప్రాయం లేదు. క్రీ.శే.575 ప్రాంతంలో పల్లవుల సామ్రాజ్యాన్ని సింహవిష్ణువు నెలకొల్పాడు. సింహవిష్ణువు వారసులనే నవీనపల్లవులుగా పిలుస్తారు. వీరు దాదాపు 300 సంవత్సరాల వరకు ‘‘కాంచీపురం’’ ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ప్రసిద్ద పల్లవుల్లో సింహవిష్ణువు కుమారుడైన మొదటి మహేంద్రవర్మ, మొదటి మహేంద్ర వర్మ కుమారుడైన మొదటి నరసింహవర్మ, రెండో మహేంద్రవర్మ, రెండో నరసింహవర్మ కీర్తి సాధించారు.
➺ మొదటి మహేంద్రవర్మ (క్రీ.శే.600-630) :
పల్లవ రాజులందరిలో గొప్పవాడు. పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించిన సింహవిష్ణువు కుమారుడు మొదటి మహేంద్రవర్మ. ఇతను పల్లవ రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానది వరకు విస్తరించాడు. ఇతనికి గుణరుడు, విచిత్రవిత్తి, చిత్రకారపులి, మత్తవిలాస అనే బిరుదులున్నాయి. ఇతను సాహిత్యంలో గొప్ప ప్రావిణ్యత కలవాడు. ఇతను ప్రారంభంలో జైనమతాన్ని ఆదరించి తర్వాత శైవ మతాన్ని స్వీకరించాడు. ఇతను సంస్కృతంలో ‘‘మత్త విలాస ప్రహసనం’’ అనే నాటకాన్ని రచించాడు. ఇతను తిరుచునాపల్లిలో ఆలయాలు నిర్మించాడు. బాదామి చాళుక్య రాజు అయిన రెండో పులకేశి పల్లవ రాజుకు చెందిన ‘కర్మ’ అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. క్రీ.శ 630 సంవత్సరంలో జరిగిన ‘‘పుల్లలూర్ యుద్దం’’ లో రెండో పులకేశి ఇతన్ని ఓడిరచాడు. ఇతను మొదటి సారిగా రాక్ కట్ టెంపుల్ డిజైన్‌తో నిర్మాణాలు చేపట్టాడు. రెండవ పులకేశి, హర్షవర్ధనుడు ఇతనికి సమకాలీన రాజులు. చాళుక్యులతో జరిగిన యుద్ధంలో మొదటి మహేంద్రవర్మ మరణించాడు. ఇతని తదనంతరం తన కుమారుడైన మొదటి నరసింహవర్మ రాజ్యాధికారం చేపట్టాడు.
➺ మొదటి నరసింహవర్మ (క్రీ.శ 630-666) :
మొదటి మహేంద్రవర్మ కుమారుడు మొదటి నరసింహవర్మ. ఇతను పల్లవ సామ్రాజ్యాన్ని క్రీ.శ.630 నుండి 666 సంవత్సరాల వరకు పరిపాలించాడు. మొదటి మహేంద్రవర్మ మరణాంతరం సింహసనాన్ని అధిష్టించాడు. ఇతని కాలంలో జరిగిన ‘‘మణిమంగళ’’ యుద్ధంలో రెండో పులకేశిని ఓడిరచాడు. చాళుక్యుల రాజధాని అయిన బాదామిని ధ్వంసం చేశాడు. చోళ, పాండ్య రాజ్యాలకు చెందిన రాజులను ఓడిరచాడు. సింహళ రాజైన మారవర్మన్‌ను సింహళ రాజ్య సింహసనంపై అధిష్టింపజేశాడు. ఇతనికి ‘వాతాపికొండ’ అనే బిరుదు కలదు. క్రీ.శ 642లో చైనా యాత్రికుడైన ‘‘హుయాన్‌త్సాంగ్’’ ఇతని ఆస్థానాన్ని సందర్శించాడు. కాంచీపురం ఇతని కాలంలో అభివృద్ది చెందింది. ప్రసిద్ద కవి ‘భారవి’ మొదటి నరసింహవర్మ ఆస్థానంలో పనిచేశాడు. నరసింహవర్మకు ‘మహామల్ల’ అనే బిరుదు కలదు. ఇతను చెక్కించిన ‘బాదామి శాసనం’ పల్లవ`చాళుక్యుల యుద్ధాల గురించి వివరిస్తుంది. ఇతని తర్వాత కుమారుడైన రెండో మహేంద్రవర్మ సింహసనాన్ని అధిష్టించాడు.
➺ రెండవ మహేంద్రవర్మ (క్రీ.శ.668-670) :
మొదటి నరసింహవర్మ అనంతరం పల్లవ రాజ్యాన్ని రెండవ మహేంద్రవర్మ పరిపాలించాడు. మహాబలిపురంలో ఆదివరహా దేవాలయంలో ఇతని కాలంలో చెక్కబడిన చిత్రాలున్నాయి. ఇతను బాదామి చాళుక్యరాజైన మొదటి విక్రమాదిత్యునిచే చంపబడ్డాడు.
➺ మొదటి పరమేశ్వరవర్మ (క్రీ.శ.670-685) :
శైవమతాన్ని ఆదరించిన మొదటి పరమేశ్వరశర్మ చాళుక్య రాజు మొదటి విక్రమాదిత్యున్ని, పాండ్యరాజు అరికేసరిలను ‘పెరుమల్లలూరు యుద్దం’ లో ఓడిరచాడు. ఇతని కాలంలో మైసూర్ గంగరాజులతో యుద్ధాలు ప్రారంభమయ్యాయి.
➺ రెండో నరసింహావర్మ (క్రీ.శ.685-730) :
ఇతని కాలంలో చైనాతో వర్తక, వాణిజ్యాలు అభివృద్ది చెందాయి. ఇతని కాలంలో మహాబలిపురంలో తీర దేవాలయం, కాంచీపురంలో కైలాసనాథ ఆలయాలు నిర్మించారు. ‘దండి’ అనే కవి ఇతని ఆస్తానంలో పనిచేశాడు. ఇతనికి ‘ఆగమప్రియ’ ‘రాజసింహ’ అనే బిరుదులున్నాయి.
➺ రెండో పరమేశ్వర వర్మ (క్రీ.శ.730-733) :
ఇతను చాళుక్య రాజైన రెండో విక్రమాదిత్యుని చేతిలో ఓడిపోయి కప్పం చెల్లించాడు. క్రీ.శ 731 లో జరిగిన ‘మిళిందై’ యుద్ధంలో రెండో పరమేశ్వర శర్మ మరణించాడు.
➺ నందివర్మ (క్రీ.శ 733-794) :
క్రీ.శ 668 నుండి 733 సంవత్సరం వరకు రెండో మహేంద్రవర్మ, మొదటి పరమేశ్వరవర్మ, రెండో నరసింహవర్మ, రెండో పరమేశ్వరవర్మ వంటి రాజులు పల్లవ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరు ఆసమర్థులు కావడంతో పల్లవ రాజ్యం వ్యాప్తి చెందలేదు. వీరి తర్వాత నంది వర్మ క్రీ.శ 733 నుండి 794 సంవత్సరం వరకు పల్లవ రాజ్యాన్ని పరిపాలించాడు. నందివర్మ వైకుంఠపెరుమాల్, ముక్తేశ్వర ఆలయాలు నిర్మించాడు.ఇతనికి ‘పల్లవమల్ల’ అనే బిరుదు కలదు.ఇతను గొప్ప విష్ణుభక్తుడు.
రెండో పరమేశ్వర శర్మ మరణాంతరం సింహవిష్ణువు వంశం అంతమైంది. భీమమర్వశాఖకు చెందిన నందివర్మ అధికారాన్ని చేపట్టాడు. క్రీ.శ.740లో బాదామి చాళుక్యరాజైన రెండో విక్రమాదిత్యుడు పల్లవరాజ్యంపై యుద్ధం చేసి పల్లవ రాజధాని కాంచీపురాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రెండో నందివర్మ పరిపాలన తర్వాత రాజ్యాధికారం చేపట్టిన దంతివర్మ (క్రీ.శ.795-845), మూడవ నందివర్మ(క్రీ.శ.845-866), నృపతుంగవర్మ (క్రీ.శ.866-880), అపరాజిత వర్మ అపరాజితవర్మ (క్రీ.శ.896-897) వంటి రాజులు అసమర్థులు కావడంతో చోళరాజుల సైన్యాలు పల్లవ రాజ్యంపై దండెత్తాయి. దీంతో పల్లవ రాజ్యం పూర్తిగా అంతమై చోళ రాజు మొదటి ఆదిత్యవర్మ సామ్రాజ్యంలో విలీనమైంది. పల్లవ రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజు అపరాజిత వర్మ.
➺ పల్లవ సామ్రాజ్య రాజుల వరుస క్రమం
- మొదటి మహేంద్రవర్మ (క్రీ.శ.600-630)
- మొదటి నరసింహవర్మ (క్రీ.శ.630-666)
- రెండో మహేంద్రవర్మ (క్రీ.శ.668-670)
- మొదటి పరమేశ్వరవర్మ (క్రీ.శ.670-685)
- రెండో నరసింహావర్మ (క్రీ.శ.685-730)
- రెండో పరమేశ్వర వర్మ (క్రీ.శ.730-733))
- నందివర్మ (క్రీ.శ.733-794)
- దంతి వర్మ (క్రీ.శ.795-845)
- మూడో నందివర్మ (క్రీ.శ.845-866)
- నృపతుంగవర్మ (క్రీ.శ.866-880)
- అపరాజితవర్మ (క్రీ.శ.896-897)
Also Read :
రాజ్య పరిపాలన వ్యవస్థ
పల్లవులు శాతవాహనుల పాలనాధానం ఆధారం చేసుకొని పరిపాలన కొనసాగించారు. పల్లవుల రాజులు ధర్మమహారాజాధిరాజ బిరుదాంకితుడై ఉండేవారు. రాజు సర్వాధికారి ఉండేవాడు. రాజు చెప్పిన మాటే శాసనంగా ఉండేది. యువరాజు మంత్రిమండలిలో సభ్యుడుగా ఉండేవారు. రాజు యొక్క అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగేది. పల్లవుల శాసనాల్లో ‘రహస్యాధికృత’, రథిక, దేశాధికృత వంటి అధికారులు ఉండేవారు. రాజు గూఢచారులను నియమించి అధికారులను, మంత్రులను పర్యవేక్షించేవాడు. పల్లవ రాజ్యంలో పనిచేసే గూఢచారులను ‘ద్యుతిక, సంజరంతక’ అని పిలిచేవారు. చోళులు, గాంగులు, రేనాటి చోళులు పల్లవ రాజ్యంలో సామంతులుగా పనిచేసేవారు.
పల్లవులు రాజ్య పరిపాలన సులభతరం చేయడం కోసం రాజ్యాన్ని ‘రాష్ట్రాలుగా, ‘విషయలుగా’, భోగలుగా, గ్రామాలుగా విభజించి పరిపాలించేవారు. రాష్ట్రాల అధిపతిని ‘‘వ్యాపృత’’ అనే వారు. గ్రామసభలో ‘ఉర్’, ‘సభ’, నగరం’ వంటి మూడు విభాగాలుండేవి. ఉర్ విభాగంలో భూస్వాములు సభ్యులుగా ఉండేవారు. సభలో బ్రాహ్మణులు సభ్యులుగా ఉండేవారు. నగరంలో వర్తకులు సభ్యులుగా ఉండేవారు. గ్రామాలలో జరిగే నేరాలను విచారణ చేయడానికి ధర్మాసనాలు అనే న్యాయస్థానాలుండేవి. గ్రామంలోని దేవాలయాల నిర్వహణ, జనాభా లెక్కల నిర్వహణ, గ్రామ తోటలు, నీటిపారుదల వ్యవహారాలు గ్రామసభలు చూసేవి.
సామాజిక - ఆర్థిక పరిస్థితులు
పల్లవ రాజ్యంలో బ్రహ్మణులకు సముచిత స్థానం ఉండేది. బ్రహ్మణులను మహామాత్రులుగా, దండనాయకులుగా నియమించేవారు. సమాజంలో ‘తుడియం’, పణం, పారియన్ అనే వర్గాలు ఉండేవి.
పల్లవుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. భూమి శిస్తు 1/6 వంతు వసూలు చేయడంతో ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ ‘‘సి`యూ కి’’ లో తెలిపిన వివరాల ప్రకారం పల్లవుల రాజ్యం సుసంపన్నమైందనీ, ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారనీ, వ్యవసాయం, వర్తక`వ్యాపారం అభివృద్ది చెందినదని తెలుస్తుంది. పల్లవ రాజ్యంలోని అధికారులు, మంత్రులు వ్యవసాయానికి నీటి అందించేందుకు మహేంద్ర తటాకం, చిత్రమేక తటాకం, పరమేశ్వర తటాకం నిర్మించారు. రాజులు బ్రహ్మణులకు, ఆలయాలకు భూదానాలు చేసేవారు. వర్తకశ్రేణులను ‘నానాదేశి’, ‘మణిగ్రామం’ అని పిలిచేవారు. మహాబలిపురం, నాగపట్నం ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. పల్లవులు చైనా, ఆగ్నేయ`ఆసియా దేశాలతో వర్తక వాణిజ్యం నిర్వహించేవారు. ‘అష్టాదశపరిహార’ అనే 18 రకాల పన్నులు, సుంకాలు విధించేవారని శాసనాల ద్వారా తెలుస్తుంది. వీరు ప్రధానంగా సుగంధద్రవ్యాలు, ముత్యాలు ఎగుమతి చేసేవారు. గుర్రాలను దిగుమతి చేసుకునేవారు.
మత పరిస్థితులు
పల్లవులు ప్రధానంగా శైవ మతస్థులుగా ఉండేవారు. కానీ కొంతమంది పల్లవ రాజులు వైష్ణవ మతాన్ని స్వీకరించారు. శైవ మత సన్యాసులను ‘నాయనార్’లు అని, వైష్ణవ మత సన్యాసులను ‘అళ్వార్’లు అని పిలిచేవారు. 63 మంది నాయనార్‌లు కలిసి వ్రాసిన తమిళ గ్రంథం ‘తేవరం/తిరుమురై’. దీనినే ద్రావిడ వేదంగా పేర్కొంటారు. తిరువ మణిక్కసాగర్ అను శైవ మత సన్యాసి ‘తిరువసగం’ అనే తమిళ గ్రంథాన్ని లిఖించాడు. 12 మంది అళ్వారులు కలిసి ‘నలయిర దివ్య ప్రబంధం’ అనే గ్రంథాన్ని రచించారు. రెండో నందివర్మ కాలంలో తిరుమంగై అల్వార్ ‘తకువప’ లో విష్ణు దేవాలయం నిర్మించినట్లు ‘తకువప శాసనం ’ ద్వారా తెలుస్తుంది. పల్లవుల కాలంలో తిరుపతి, శ్రీరంగం, కాంచీపురం ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉండేవి.
పల్లవుల సాహిత్య సేవ
పల్లవుల యొక్క అధికార, శాసన భాషగా సంస్కృతం ఉండేది. మొదటి మహేంద్రవర్మ సంస్కృతంలో స్వయంగా కవి కావడంతో సంస్కృతంలో ‘మత్త విలాస ప్రహసనం’ ‘భగవజ్జుక అనే అనే నాటకాలను రచించాడు.
మత్తవిలాస ప్రహసనం - ఇందులో న్యాయస్థానంలో జరిగే అవినీతిని వివరిస్తుంది. సత్యసోముడు కథానాయకుడిగా ఉన్న ఈ నాటకం యొక్క ఆనవాళ్లు రంగనాథ స్వామి ఆలయంలో లభ్యమయ్యాయి.
భగవజ్జుక - ఒక సన్యాసి వేశ్య శరీరంలోకి పోవడం అనే ప్రధానంశంగా రచించారు. ఇందులో దక్షిణ భారతదేశంలోని చిత్రకళపై దక్షిణ చిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. అదే విధంగా కుడి మియామలై శాసనం, తిరుమయ్యం శాసనం అనే సంగీత శాసనాలను వేయించాడు. కుడి మియామలై శాసనంలో మొదటి మహేంద్రవర్మ తాను సంగీత విద్వాంసుడైన ‘‘రుద్రాచార్యుని’’ శిష్యుడినని పేర్కొన్నాడు.
పల్లవుల రాజ్యంలో దండి, భారవిలు ఆస్థాన కవులుగా పనిచేశారు. దండి దశకుమార చరిత, అవంతి సుందరి కథాసార, కావ్య దర్శనం అనే రచనలు చేశాడు. భారవి కిరాతార్జునీయం, శిశుపాలవధ అనే రచనలు చేశాడు.
- మొదటి మహేంద్రవర్మ - మత్త విలాస ప్రహసనం, భగవజ్జుక
- దండి - దశకుమార చరిత, అవంతి సుందరి కథాసార, కావ్య దర్శనం
- భారవి - కిరాతార్జునీయం, శిశుపాలవధ
పల్లవుల కాలంనాటి వాస్తు- శిల్పకళ
భారత వాస్తు శిల్పకళా చరిత్రలో పల్లవుల యుగం ఒక అత్యున్నత శకమని సుప్రసిద్ద చరిత్రకారుడైన ‘వి.ఎ.స్మిత్’ అభివర్ణించాడు. పల్లవుల కాలంలో శిల్పులు నూతన శిల్పకళను అవలంభించారు. పల్లవుల కాలంలో వాస్తు-శిల్పకళారీతి నాలుగు దశలుగా పేర్కొనవచ్చు.
➺ మొదటి దశ :
మహేంద్ర శిల్ప పద్దతి :
మొదటి మహేంద్రవర్మ కాలం నుండి శిల్పులు కొండలను తొలిచి ఆలయాలను నిర్మించారు. దేవాలయం అను పదానికి బదులు ‘మండపం’ అనే పదాన్ని వాడేవారు. సువిశాల మండపాలు, విశాలమైన స్తంభాలతో మొదటి మహేంద్రవర్మ స్వయంగా ఎటువంటి ఇటుకలు, వెదురు, లోహాన్ని ఉపయోగించకుండా త్రిమూర్తి ఆలయాన్ని నిర్మించాడు. ఈ విషయాన్ని తాను లిఖించిన ‘మండగపట్టు శాసనంలో పేర్కొన్నాడు.
మొదటి మహేంద్రవర్మ నిర్మించిన ఆలయాలు
- పంచపాండవ గుహాలయాలు
- మల్లేశ్వరాలయం
- మండప్పగట్టు ఆలయం
- పల్లవరం గుహాలయం
- రంగనాథ స్వామి ఆలయం
- భైరవకొండ శివాలయం
- సిత్తనవసల్ శివాలయం (ఫ్రెస్కో పెయింటింగ్)
➺ రెండవ దశ :
మామల్ల శైలి
మొదటి నరసింహవర్మ లేదా మామల్ల కాలంలో మహాబలిపురంలో అద్భుతమైన ఏకశిలానిర్మాణాలు/రాతిరథాలు) నిర్మించారు. మహాబలిపురంలో మొత్తం ఏడు రాతిరథాలు/పగోడాలు నిర్మించారు. ధర్మరాజ రథాన్ని మూడు అంతస్థులలో చతురస్రాకారంలో ద్రావిడ పద్దతిలో నిర్మించారు. దీనిని ద్రావిడ శైలికి తొలి నమూనాగా పేర్కొంటారు. మహాబలిపురంలో ‘పంచపాండవవరథాల్లో’ ధర్మరాజుకి, భీమునికి, అర్జునికి, ద్రౌపదికి, సహాదేవునికి 5 రథాలను నిర్మించారు. ద్రౌపది, కుంతికోసం మరో రెండు రథాలు చెక్కబడ్డాయి. ఇందులో ధర్మరాజ రథం అన్నింటి కన్నా పెద్దది.
➺ మూడవ దశ :
రాజసింహ శైలి :
రెండో నరసింహవర్మ కాలంలో దేవాలయాల నిర్మాణం అత్యున్నత స్థాయికి చేరింది. రెండో నరసింహవర్మ కాలంలో రాజసింహపవ్వల శైలిరీతితో దేవాలయాలు, గుహాలు నిర్మించారు. ఈశ్వర దేవాలయం, ముకుంద దేవాలయం, తీర దేవాలయం ద్రవిడ శైలిలో రెండో నరసింహవర్మ మహాబలిపురంలో నిర్మించాడు.
రెండో నరసింహవర్మ కట్టించిన దేవాలయాలు
- తీరదేవాలయం
- ఈశ్వర ఆలయం
- ముకుంద ఆలయం
- పనమలై ఆలయం, కైలాసనాథ ఆలయం
- వైకుంఠ పెరుమాల్ (కాంచీపురం) ఆలయం
తీర దేవాలయం
ఈ దేవాలయాన్ని సముద్రతీరానికి దగ్గరలో నిర్మించారు. ఇందులో శివుని, విష్ణువుల విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి. ఈ దేవాలయాన్నే ‘త్రిమూర్తి కోవెల్’ అని అంటారు. దీనిలోని క్షత్రియ పల్లమేశ్వర విగ్రహం, రాజసింహ పల్లమేశ్వర విగ్రహం, నరపతి సింహ పల్లమేశ్వర విగ్రహం ఉన్నాయి. గర్భగృహంపై శిఖరం కల్గిన తొలి దేవాలయం ఇదే.
కైలాసనాథ దేవాలయం (కంచి)
దీనిని మూడో మహేంద్రవర్మ పూర్తి చేశాడు. దీనిలో 3 వేరు వేరు భాగాలున్నాయి. గోపుర ఆకారంలో భుజస్తంభం గల గర్భ గుడి, మండపం, దీర్ఘచతురస్రాకారంలో ఉన్న సభాప్రాంగణం.
➺ నాల్గవ దశ :
పల్లవుల కాలంనాటి నాల్గవ దశలో దేవాలయాల నిర్మాణం తగ్గుముఖం పట్టింది. ఈ కాలంలో చిన్న చిన్న దేవాలయాలు నిర్మించారు. నంది వర్మ నిర్మించిన వైకుంఠ పెరుమాళ్ (విష్ణుమూర్తి) ఆలయంను రాజసింహ శైలిలో నిర్మించారు. ఈ దేవాలయంలో 4 అంతస్థులతో కూడిన గర్భగృహం కల్గి ఉంది. దీనిని ఇసుక, గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ఈ దేవాలయంలో ‘బంగారు బల్లి’ ని తాకడానికి ప్రదర్శిస్తారు. నంది వర్మ అనంతరం అపరాజితవర్మ కాలంలో విరాటేశ్వర(అరుత్తని) ఆలయాన్ని నిర్మించారు.
నందివర్మ నిర్మించిన దేవాలయాలు
- ముక్తేశ్వర ఆలయం (కంచి)
- తిప్రురాంతకేశ్వర ఆలయం (కంచి)
- మాతంగేశ్వర ఆలయం (కంచి)
- వాడమల్లేశ్వర ఆలయం (ఆర్గాదమ్)
- పరుశురామేశ్వర దేవాలయం (గుడిమల్లం)
0 Comments