
పల్లవుల రాజ్య పరిపాలన వ్యవస్థ
Indian History in Telugu
పల్లవులు శాతవాహనుల పాలనాధానం ఆధారం చేసుకొని పరిపాలన కొనసాగించారు. పల్లవుల రాజులు ధర్మమహారాజాధిరాజ బిరుదాంకితుడై ఉండేవారు. రాజు సర్వాధికారి ఉండేవాడు. రాజు చెప్పిన మాటే శాసనంగా ఉండేది. యువరాజు మంత్రిమండలిలో సభ్యుడుగా ఉండేవారు. రాజు యొక్క అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగేది. పల్లవుల శాసనాల్లో ‘రహస్యాధికృత’, రథిక, దేశాధికృత వంటి అధికారులు ఉండేవారు. రాజు గూఢచారులను నియమించి అధికారులను, మంత్రులను పర్యవేక్షించేవాడు. పల్లవ రాజ్యంలో పనిచేసే గూఢచారులను ‘ద్యుతిక, సంజరంతక’ అని పిలిచేవారు. చోళులు, గాంగులు, రేనాటి చోళులు పల్లవ రాజ్యంలో సామంతులుగా పనిచేసేవారు.
పల్లవులు రాజ్య పరిపాలన సులభతరం చేయడం కోసం రాజ్యాన్ని ‘రాష్ట్రాలుగా, ‘విషయలుగా’, భోగలుగా, గ్రామాలుగా విభజించి పరిపాలించేవారు. రాష్ట్రాల అధిపతిని ‘‘వ్యాపృత’’ అనే వారు. గ్రామసభలో ‘ఉర్’, ‘సభ’, నగరం’ వంటి మూడు విభాగాలుండేవి. ఉర్ విభాగంలో భూస్వాములు సభ్యులుగా ఉండేవారు. సభలో బ్రాహ్మణులు సభ్యులుగా ఉండేవారు. నగరంలో వర్తకులు సభ్యులుగా ఉండేవారు. గ్రామాలలో జరిగే నేరాలను విచారణ చేయడానికి ధర్మాసనాలు అనే న్యాయస్థానాలుండేవి. గ్రామంలోని దేవాలయాల నిర్వహణ, జనాభా లెక్కల నిర్వహణ, గ్రామ తోటలు, నీటిపారుదల వ్యవహారాలు గ్రామసభలు చూసేవి.
Also Read :
0 Comments