పల్లవుల సాహిత్య సేవ | Pallava Dynasty in Telugu | Indian History in Telugu

Pallava Dynasty Administrative system

పల్లవుల సాహిత్య సేవ 

Indian History in Telugu 

పల్లవుల సాహిత్య సేవ : 

పల్లవుల యొక్క అధికార, శాసన భాషగా సంస్కృతం ఉండేది. మొదటి మహేంద్రవర్మ సంస్కృతంలో స్వయంగా కవి కావడంతో సంస్కృతంలో ‘మత్త విలాస ప్రహసనం’ ‘భగవజ్జుక అనే అనే నాటకాలను రచించాడు.

మత్తవిలాస ప్రహసనం -

ఇందులో న్యాయస్థానంలో జరిగే అవినీతిని వివరిస్తుంది. సత్యసోముడు కథానాయకుడిగా ఉన్న ఈ నాటకం యొక్క ఆనవాళ్లు రంగనాథ స్వామి ఆలయంలో లభ్యమయ్యాయి. 

భగవజ్జుక - 

ఒక సన్యాసి వేశ్య శరీరంలోకి పోవడం అనే ప్రధానంశంగా రచించారు. ఇందులో దక్షిణ భారతదేశంలోని చిత్రకళపై దక్షిణ చిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. అదే విధంగా కుడి మియామలై శాసనం, తిరుమయ్యం శాసనం అనే సంగీత శాసనాలను వేయించాడు. కుడి మియామలై శాసనంలో మొదటి మహేంద్రవర్మ తాను సంగీత విద్వాంసుడైన ‘‘రుద్రాచార్యుని’’ శిష్యుడినని పేర్కొన్నాడు.

పల్లవుల రాజ్యంలో దండి, భారవిలు ఆస్థాన కవులుగా పనిచేశారు. దండి దశకుమార చరిత, అవంతి సుందరి కథాసార, కావ్య దర్శనం అనే రచనలు చేశాడు. భారవి కిరాతార్జునీయం, శిశుపాలవధ అనే రచనలు చేశాడు.  

  • మొదటి మహేంద్రవర్మ - మత్త విలాస ప్రహసనం, భగవజ్జుక 
  • దండి - దశకుమార చరిత, అవంతి సుందరి కథాసార, కావ్య దర్శనం 
  • భారవి - కిరాతార్జునీయం, శిశుపాలవధ 


Also Read :

Pallava Dynasty in Telugu 


Also Read :



Post a Comment

0 Comments