తెలంగాణ మోడల్ స్కూల్ నోటిఫికేషన్
6వ నుండి 10వ తరగతి మోడల్‌స్కూల్ అడ్మిషన్స్
ఆంగ్లమాద్యమంలో విద్యను భోదించే తెలంగాణ మోడల్‌స్కూల్స్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. 2025-2026 సంవత్సరం ప్రవేశాల నోటిఫికేషన్‌ను మోడల్ స్కూల్స్ డైరెక్టర్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6వ తరగతితో పాటు 7 నుండి 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 200/- (జనరల్), 125/- (బిసి/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు) ఆన్‌లైన్ ఫీజు చెల్లించి ధరఖాస్తులు చేసుకోవచ్చు.
మోడల్ స్కూళ్లలో 6 నుండి 10వ తరగతి వరకు ఆన్‌లైన్ ధరఖాస్తులను 06 జనవరి 2025 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు స్వీకరించనున్నారు. హాల్‌టికెట్లను 03 ఏప్రిల్ 2025 నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. మోడల్‌స్కూల్ పరీక్షను 13 ఏప్రిల్ 2025 రోజున నిర్వహించనున్నారు.
➺ ప్రవేశ పరీక్ష పేరు :
- తెలంగాణ మోడల్ స్కూల్స్
➺ ఏయే తరగతులు
- 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు
➺ అర్హత :
సంబందిత తరగతిలో ప్రవేశానికి కిందిస్థాయి తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
➺ పరీక్షా ఫీజు :
- రూ॥200/- (జనరల్)
- రూ॥125/- (బిసి/ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ఈడబ్ల్యూఎస్)
Also Read :
➺ వయస్సు :
- 6వ తరగతికి 10 సంవత్సరాలు
- 7వ తరగతికి 11 సంవత్సరాలు
- 8వ తరగతికి 12 సంవత్సరాలు
- 9వ తరగతికి 13 సంవత్సరాలు
- 10వ తరగతికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి.
➺ పరీక్షా విధానం :
- 6 వ తరగతికి 100 ప్రశ్నలకు 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షను 2 గంటల్లో నిర్వహిస్తారు. తెలుగు, గణితం, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల నుండి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు.
- 7 నుండి 10 తరగతులకు గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, ఇంగ్లీష్ నుండి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కోదాని నుండి 25 ప్రశ్నలు ఇస్తారు.
➺ విద్యాబోధన :
- ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా బోధిస్తారు.
➺ ముఖ్యమైన తేదీలు :
- ధరఖాస్తులు ప్రారంభం - 06 జనవరి 2025
- ధరఖాస్తులు ముగింపు - 28 ఫిబ్రవరి 2025
- హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ - 03 ఏప్రిల్ 2025 వరకు
- పరీక్ష తేది - 13 ఏప్రిల్ 2025
For Online Apply
0 Comments