BITSAT 2025:
బీటెక్, బీఫార్మసీ అడ్మిషన్‌ల కొరకు బిట్‌శాట్ ఎంట్రన్స్ టెస్టు
బిట్ శాట్ దేశంలో ఇంజనీరింగ్, సైన్స్ ఎడ్యుకేషన్‌లో ప్రఖ్యాతిగాంచిన ఎంట్రన్స్ టెస్టు. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) నిర్వహించే ఈ ఎంట్రన్స్ టెస్టు ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సులలో అడ్మిషన్‌లు పొందవచ్చు. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ కోసం సిద్దమయ్యే విద్యార్థులు దీనిలోనూ ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. బిట్స్‌కు ప్రస్తుతం పిలానీ, గోవా, హైదరాబాద్, ముంబై, దుబాయిలలో క్యాంపస్‌లు కలవు. పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంటిగ్రేటేడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సులుగా పేర్కొనే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు బిట్‌శాట్‌ను నిర్వహిస్తారు.
➺ ఎంట్రన్స్ టెస్టు :
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)
➺ క్యాంపస్‌లు :
- పిలానీ
- గోవా
- హైదరాబాద్
- ముంబై
- దుబాయి
➺ విద్యార్హతలు :
- ఇంటర్మిడియట్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్,బయాలజీలలో ఒక్కో సబ్జెక్టులో ఖచ్చితంగా 60 శాతం మార్కులుండాలి
- ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ పరీక్షా విధానం :
బిట్‌శాట్ పరీక్షను రెండు సెషన్లలలో నిర్వహిస్తారు.విద్యార్థులు రెండు సెషన్లకు లేదా ఏదో ఒక సెషన్‌కు అప్లై చేసుకోవచ్చు. రెండు సెషన్లకు హజరైతే ఉత్తమ స్కోర్ సాధించిన సెషన్‌ను పరిగణలోకి తీసుకుంటారు.
➺ పరీక్షా పద్దతి :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ముఖ్యమైన తేదీలు :
సెషన్-1 :
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 18 ఏప్రిల్ 2025
ఆన్‌లైన్ టెస్టు : 26 మే నుండి 10 జూన్ 2025 వరకు
సెషన్ - 2 :
ఆన్‌లైన్ ధరఖాస్తులకు తేది : 26 మే నుండి 10 జూన్ 2025 వరకు
ఆన్‌లైన్ టెస్టులు : 22 జూన్ నుండి 26 జూన్ 2025 వరకు
అడ్మిషన్ జాబితా విడుదల : 09 జూలై 2025
0 Comments