మొగల్ సామ్రాజ్యం రెవెన్యూ పాలన | Mughal Empire Revenue System GK Questions | Indian History Gk Questions and Answers
☛ Question No. 1
మొగల్ సామ్రాజ్యంలో ప్రధాన ఆదాయ వనరు ఏది?
A) వ్యాపార పన్ను
B) భూమి శిస్తు
C) కస్టమ్స్ పన్ను
D) జిజియా పన్ను
Answer : B) భూమి శిస్తు
☛ Question No. 2
మొగల్ కాలంలో భూమి శిస్తును ఇంకేమని పిలిచేవారు?
A) మాల్ లేదా ఖరజ్
B) జకాత్
C) జిజియా
D) సల్తనత్
Answer : A) మాల్ లేదా ఖరజ్
☛ Question No. 3
మొగల్ చక్రవర్తులు భూమి శిస్తుగా సాధారణంగా ఎంత వసూలు చేసేవారు?
A) 1/2 వంతు
B) 1/4 వంతు
C) 1/3 వంతు
D) 1/5 వంతు
Answer : C) 1/3 వంతు
☛ Question No. 4
పంటను మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని ప్రభుత్వానికి ఇవ్వడమనే విధానం ఏది?
A) కంకుట్
B) జబ్తి
C) నషఖ్
D) బతాయి / గల్లబక్షి
Answer : D) బతాయి / గల్లబక్షి
☛ Question No. 5
మొత్తం పంటను ఒక ప్రాతిపాదికన అంచనా వేసి భూమి శిస్తు నిర్ణయించే విధానం ఏది?
A) కంకుట్
B) నషఖ్
C) బతాయి
D) అయినీ దహసాల
Answer : A) కంకుట్
☛ Question No. 6
గత సంవత్సరం చెల్లింపుల ఆధారంగా భూమి శిస్తు నిర్ణయించే విధానం ఏది?
A) కంకుట్
B) నషఖ్
C) బతాయి
D) జబ్తి
Answer : B) నషఖ్
☛ Question No. 7
జబ్తి / బందోబస్త్ / అయినీ దహసాల విధానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఎవరు?
A) అబుల్ ఫజల్
B) బీరబల్
C) తోడర్‌మాల్
D) షాహీద్ అలీ
Answer : C) తోడర్‌మాల్
☛ Question No. 8
జబ్తి విధానం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది?
A) 1565
B) 1625
C) 1600
D) 1582
Answer : D) 1582
☛ Question No. 9
జబ్తి విధానంలో భూమిని కొలవడానికి ఉపయోగించిన కొలబద్ద ఏది?
A) ముఘల్ గజ్
B) ఇలాహీ గజ్
C) తోడర్ గజ్
D) అక్బరీ గజ్
Answer : B) ఇలాహీ గజ్
☛ Question No. 10
జబ్తి విధానంలో భూమిని ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
A) మూడు
B) ఐదు
C) నాలుగు
D) ఆరు
Answer : C) నాలుగు (పోలాజ్, పరోటీ, చాచరు, బంజరు)

0 Comments