
Tspsc Telangana History || ikshvaku dynasty kings list in telugu
Gk in Telugu || General Knowledge in Telugu
Tspsc Telangana History in Telugu
ఇక్ష్వాకుల సామ్రాజ్యం
Tspsc Telangana History in telugu : ఇక్ష్వాకులు ఆంధ్రభృత్యులు, శ్రీ పర్వతీయులు అని పిలుస్తారు. ఇక్షు అనగా చెరుకు / తీయనిది అని అర్థం. పురాణాల ప్రకారం ఇక్ష్యాకుల రాజ్యాన్ని 7 మంది రాజులు పరిపాలించారు. కానీ వీరపురుషదత్త చెక్కించిన ‘‘ అల్లూరి ’’ శాసనం ప్రకారం ఇక్ష్యాకుల రాజ్యాన్ని 4 గురు పరిపాలించారని పేర్కొంది. ఇక్ష్యాకుల రాజ్యం దాదాపు 75 సంవత్సరాలు విరాజిల్లింది. వీరు శాతవాహనుల యొక్క సామాంతులుగా పనిచేశారని ‘‘అల్లూరి’’ శాసనం ద్వారా తెలుస్తుంది. ఇక్ష్యాకుల రాజ్యస్థాపకుడు శ్రీ శాంతములుడు అనే రాజు. ఇక్ష్వాకులలో గొప్పవాడు వీరపురుష దత్తుడు. ఇక్ష్వాకులలో చివరి రాజు రుద్ర పురుష దత్తుడు. వీరు నాగర్జున కొండ మీద నిర్మించిన విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీరు శైవమతాన్ని ఆరాదించేవారు. వీరి యొక్క రాజలాంచనం సింహాం ఉండేది. కార్తీకేయ స్వామిని ఆరాధ్య దైవంగా పూచించేవారు. హారతిదేవి(సంతాన దేవి)ని ఆరాధ్య స్త్రీ దైవంగా చేసుకొని పూజించేవారు. వీరు శాతవాహనులలో చివరి రాజు అయిన 3వ పులోమావిగా ఓడిరచి ఇక్ష్వాకుల రాజ్యాన్ని స్థాపించారు.
చరిత్రకారుల అభిప్రాయాలు
1) రాప్సన్, బూలర్ చరిత్రకారులు సూచించిన ప్రకారం ఇక్ష్యాకులు ఉత్తర భారతదేశానికి చెందిన వారని తెలిపారు.
2) ఓగేల్ అనే చరిత్రకారుని ప్రకారం వీరు కన్నడ ప్రాంతానికి చెందినవారని తెలిపాడు.
3) కె.గోపాలచారి అభిప్రాయం ప్రకారం వీరు తమిళ ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నాడు.
4) కృష్ణశాస్త్రి ప్రకారం వీరు విజయపురి జన్మస్థలంగా పేర్కొన్నాడు.
5) కాల్డ్‌వెల్ ప్రకారం వీరు ఆంద్రాప్రాంతానికి చెందినవారని తెలిపారు.
6) న్యాయసేనుడు రచించిన జైనధర్మామృతం ఉత్తరాధి నుండి వలస వచ్చారని చెబుతుంది
7) అశ్వఘోషుడు రచించిన బుద్ద చరిత్ర వీరు శాఖ్యముని శాఖ అని చెబుతుంది.
8) బి.ఎన్ శాస్త్రి ప్రకారం శ్రీశాంతములు దక్షిణపదపతి అనే బిరుదు పొందాడని చెప్పాడు.
9) డి.రాజరెడ్డి పండితుడి ప్రకారం వీరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో పరిపాలన కొనసాగించారని తెలిపారు.
10) బి.ఎస్ హన్మంతరావు ప్రకారం వీరు గుంటూరు, కడప, ప్రకాశం ప్రాంతాలను కేంద్రంగా పరిపాలించారని తెలియజేశాడు.
1) శ్రీ శాంతములుడు :-
శ్రీ శాంతములుడు ఇక్ష్వాకుల రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనికి మహదానపతి, శతసహస్ర హలక అనే బిరుదులు కలవు. బి.ఎన్ శాస్త్రి ప్రకారం ఇతనికి దక్షిణాపదపతి బిరుదు ఉన్నట్లు తెలుస్తుంది. ఇతను శాతవాహనులలో చివరి రాజు అయిన 3వ పులోమావి వద్ద పనిచేసినాడు. ఆ సమయంలో 3వ పులోమావిని ఓడించి ఇక్ష్వాకుల రాజ్యాన్ని స్థాపించాడు. ఈ విషయం 3వ పులోమావి రచించిన "మ్యాకదోని" అనే శాసనంలో పేర్కొనడం జరిగింది. ఇతను "కేశనపల్లి, దాచేపల్లి, రెంటాల" అనే శాసనాలను ప్రాకృతిక భాషలో లిఖించాడు. ఇందులో రెంటాల శాసనంలో శ్రీశాంతములుని యొక్క గొప్పతనాన్ని, బిరుదుల గురించి తెలిపింది. ఇతను రాజసూయ, అశ్వమేధ, వాజసేయ యాగాలను నిర్వహించాడు. ఇతను అగ్నిస్తోమ , అగ్నిహోత్రాది అనే వైదిక క్రతువులను నిర్వహించాడు. ఇతనికి పుగియ, ధనిక, కులాల, హిరణ్య అనే సామంత రాజ్యాలున్నాయి. విజయపురిలో రోమన్‌ల సహాయంతో స్టేడియాన్ని నిర్మించాడు. ఇతనికి భార్య మఠారిశ్రీ / మాధురిశ్రీ, కుమార్తె అటవిశాంతశ్రీ, కుమారుడు వీరపురుషదత్తుడు, సోదరిమణులు శాంతశ్రీ, హర్మశ్రీలు ఉన్నారు.
శ్రీశాంతములుడు సోదరి అయిన శాంతశ్రీ ఇక్ష్వాకుల రాజ్యంలో మొదటి సారిగా బౌద్ద మతాన్ని అవలంభించింది. ఈమె సామంత రాజు పుగియ ప్రాంత రాజైన స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు. శాంతశ్రీ కుమార్తెలు బాపుశ్రీ, షష్టిశ్రీలున్నారు. ఈమె నాగర్జున కొండవద్ద ‘‘అపర శైల భక్తుడు ’’ కోసం మహాస్థూపం విహారము నిర్మించింది.
Tspsc Telangana History in telugu :
2) మాడరీ శ్రీ వీర పురుష దత్తుడు / మొదటి పురుష దత్తుడు :-
ఇతనిని దక్షిణ భారత అశోకుడు అని పిలుస్తారు. ఇతను మొదట శైవమతాన్ని అనుసరించి ఆ తర్వాత బౌద్దమతాన్ని స్వీకరించనట్లుగా నాగార్జున కొండ వద్ద దొరికన శిల్పం ద్వారా తెలుస్తుంది. ఇతను తన మేనత్త, చెల్లెళ్ల ప్రభావంతో బౌద్దమతాన్ని స్వీకరించాడు. అందువల్ల ఇతని కాలాన్ని బౌద్దమతానికి స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. ఇతను భారతదేశంలోనే మొదటి శ్రీ పర్వత బౌద్ద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇతను ఉజ్జయిని రాకుమార్తె రుద్రధర భట్టారిక (భట్ట మహాదేవి) ను పెళ్లిచేసుకొని మేనత్త కుమార్తెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇతని సేనాపతి ఆనందుడు శ్రీ పర్వత విహారానికి మరమ్మత్తులు చేయించాడు. ఇతను బౌద్ద చార్యుడు మహాదేవ భిక్షు సమకాలీనుడిగా ఉన్నాడు. ఇతని మేనత్త శాంతిశ్రీ ఇతనికి విజయాలు కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని బౌద్ద ఆరామాలను నిర్మించడానికి ప్రత్యేకంగా బదాంత చార్య అనే ఆచార్యుడిని నియమించింది. ఇతని కాలంలో అల్లూరు (శాతవాహనులకు సామంతులుగా ఉండేవారని తెలుపుతుంది.), నాగార్జున కొండ (వీరు శాక్య వంశస్థులు గా ప్రస్తావించిన శాసనం), అమరావతి, జగ్గయ్యపేట, ఉప్పుగూడురు అనే శాసనాలున్నాయి.
3) ఎహువల శాంతములుడు / 2వ శాంతములుడు :-
ఇతని గురించి గుంటూరు జిల్లా గుమ్మడిరుద్ర వద్ద లభించిన శాసనం ద్వారా తెలుస్తుంది. ఇతను హిందూ దేవాలయాలు నిర్మించిన మొదటిరాజుగా కీర్తి సాధించాడు. ఇతని కాలంలో నాగర్జున కొండపై పుష్పభద్ర స్వామి దేవాలయం, కార్తికేయుని ఆలయం, నవగ్రహ ఆలయం, హారతి ఆలయం, నాడగేశ్వర ఆలయం / నందికేశ్వర ఆలయాలు నిర్మించారు. ఇతని కాలంనుండే సంస్కృతంలో శాసనాలు వేయించడం జరిగింది. ఇతనికి ఎలిసిరి అనే సేనాధిపతి ఉండేవాడు. ఎలిసిరి నాగార్జున కొండ వద్ద సర్వ దేవాలయం, ఏలేశ్వరం అనే నగరాన్ని నిర్మించాడు. ఇతని కాలంలో అభిర రాజు శకశేనుడు సేనాని శివసేనుడు నాగార్జున కొండ వద్ద అష్టభుజ నారాయణస్వామి దేవాలయమును నిర్మించాడు. ఇటీవల గుమ్మడూరు వద్ద ఎహువల శాంతములుడు యొక్క శాసనం లభ్యమైంది.
4) రుద్ర పురుషదత్తుడు :-
రుద్రపురుష దత్తుడు గురించి గురజాల శాసనం ద్వారా తెలుస్తుంది. ఇతని తల్లి సిరివమ్మబట్ట సమాధిపై ‘‘ ఛాయాస్తంభ శాసనం చేయించాడు. "మంచికల్లు" శాసనం ద్వారా పల్లవరాజు సింహవర్మ ఇతడిని చంపి రాజ్యాన్ని ఆక్రమించినాడని తెలుస్తుంది. శివస్కంద వర్మ వేయించిన ‘‘ మైదవోలు ’’ శాసనం ద్వారా ఈ విషయం ధృవీకరించడం జరిగింది. ఇతని కాలంలో పల్లవ రాజుల వీరి రాజ్యంపై దాడులు ప్రారంభించారు. ఆంధ్ర దేశంలో తొలి పల్లవ శాసనం అయిన సింహవర్మ వేయించిన ‘‘మంచికల్లు ’’ శాసనం ద్వారా మొదటిగా పల్లవరాజు సింహావర్మ ఇక్ష్వాకులపై దాడి చేశాడు. ఇతని తర్వాత పల్లవ రాజైన శివస్కందవర్మ ఇక్ష్వాకు రాజ్యంపై దాడి చేసి కృష్ణా నది దక్షిణాన ఉన్న ప్రాంతాలను ఆక్రమించాడు.
➠ ఉపాసిక భోదిశ్రీ :
ఈమె అమరావతిలో బండాగారి బోధిశర్మ మేనకోడలు, ఈమె నాగార్జున కొండపై గల బోధి వృక్షం చుట్టు వేదికలను నిర్మించింది. మహవీర వాసిన్ శాఖకు స్థూప విహారం నిర్మించింది. విదేశాలకు బౌద్దమత ప్రచారానికి బౌద్ద సన్యాసులను పంపింది.
➠ ఇక్ష్వాకుల కాలం నాటి పరిస్థితులు :
ఇక్ష్వాకులు రోమన్లతో వర్తకం చేసేవారు. వారికి సంబంధించిన నాణాలు నాగార్జున కొండ, జగ్గయ్యపేటలో లభించాయి. విషవట్టి శాసనం ప్రకారం వీరి కాలంలో చేతివృత్తుల సంఘానికి ఉండే నాయకున్ని ఉలిక / ప్రముఖ అని పిలిచేవారు. వీరికాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో పితృస్వామిక వ్యవస్థ ఉండేది. బహుభార్యత్వం ఉన్నత వర్గాలలో ఉండేది. సతీసహగమనం ఉన్నట్లుగా అమరావతిలోని శిల్పస్థంభం ద్వారా చెప్పవచ్చు. నాగార్జున కొండలో తొలిదశలో మహాయానం, మలిదశలో హీనయానం ఆదరించబడిరది. నాగార్జున కొండలోని ఒక శిల్పంపై బదంతా చార్య అనే శిల్పి పేరు కనిపిస్తుంది. దీని ప్రకారం వీరి కాలంలో శిల్పాలపై శిల్పుల పేర్లు చెక్కినట్లు తెలుస్తుంది. కోరికలు తీరిన భక్తులు ముడపు స్తూపాల పేరుతో చిన్న స్థూపాలను నిర్మించే సాంప్రదాయం ప్రారంభమయ్యింది. నాగార్జున కొండలు దక్షిణ గయగా పేర్కొంటారు.
Tspsc Telangana History in telugu :
➠ ఇక్ష్వాకుల పరిపాలనలో ముఖ్యాంశాలు -
- పురాణాల ఆధారంగా ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయ ఆంధ్రులు అని పేర్కొన్నారు.
- ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. దీనికి మరో పేరు శ్రీ పర్వతం. దీనికి ప్రాచీన నామం నల్లమల్లురు పర్వతం నేటి నాగర్జున కొండ.
- ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు వశిష్టీ పుత్ర శ్రీశాంతములుడు
- వశిష్టీ పుత్ర శ్రీశాంతములుడు తన చెల్లెను పుకియ వంశానికి చెందిన మహసేనాపతి మహాతళ వారనుకు ఇచ్చి వివాహం చేశాడు. తన కూతురు శాంతిశ్రీని ధనిక కుటుంబానికి చెందిన మహా సేనాపతి విశాఖనాగకు ఇచ్చి వివాహం చేశాడు.
- వశిష్టీ పుత్ర శ్రీశాంతములుడు వైదిక మతాన్ని అనుసరించినప్పటికి బౌద్ద మతన్ని గౌరవించాడు.
- వశిష్టీ పుత్ర శ్రీశాంతములుడు అనంతరం అతని కుమారుడు వీరపురుష దత్తుడు పరిపాలించాడు.
- వీరపురుష దత్తుడు ఉజ్జయిని శకరాజైన రుద్రసేన కుమార్తె రుద్ర ధర భట్టారికను వివాహం చేసుకున్నాడు.
- వీరపురుష దత్తుడు తన కూతురుని కూతురు కోడబలిశ్రీని చుటూ రాజకుమారునికి ఇచ్చి వివాహం చేశాడు.
- వీరపురుష దత్తుడు ఇక్ష్వాకుల రాజులందరిలో గొప్పవాడు. ఇతనికాలంను బౌద్దమతానికి స్వర్ణయుగంగా పిలుస్తారు.
- ఇక్ష్వాకుల రాజులందరిలో చివరిరాజు రుద్ర పురుషదత్తుడు. ఇతను తన తల్లి స్మారకార్థం ‘‘ ఛాయస్తంభం ’’ ను కట్టించినాడని నాగార్జునకొండలో లభించిన శాసనం ద్వారా తెలుస్తుంది.
- వీరియొక్క సామ్రాజ్య పతనం గురించి పల్లవులు వేయించిన మైదవోలు, మంచికల్లు శాసనాలు వివరిస్తాయి.
- వీరియొక్క నాణేలు తెలంగాణలోని పణిగిరి, నేలకొండపల్లి, వడ్డేమాను, ఏలేశ్వరం ప్రాంతాలలో లభించినట్లు తెలుస్తుంది.
- వీరు ఏనుగు బొమ్మ గుర్తుగల నాణేలు ముద్రించినట్లు తెలుస్తుంది.
- ఇక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పకళ అభివృద్ది చెందింది.
- ఇక్ష్వాకుల కాలంలో మోటుపల్లి, ఘంటసాలు ప్రముఖ ఓడరేవులుగా ప్రసిద్ది చెందాయి.
- వీరికాలంలో మిఠాయి వ్యాపారులను పూసిన శ్రేణి అని, తమలపాకుల వ్యాపారా సంఘాన్ని పర్నికశ్రేణి అని చేతివృత్తుల సంఘాల నాయకుడిని ఉలికప్రముఖ అని పిలుస్తారు.
- వీరపురుషదత్తుని కాలంలో బౌద్దమత ప్రాముఖ్యత గురించి భావవివేకుడు అనే పండితుడి ద్వారా తెలుస్తుంది.
- వీరికాలంలో తమ యొక్క శిల్పకళకు ఆకుపచ్చ రంగు రాతిని ఉపయోగించేవారు.
- వీరుపురుష దత్తుని కాలంలో నాగర్జునకొండ దక్షిణ గయగా పేరుగాంచింది.
- రోమన్ల బంగారు నాణేలు నాగార్జున కొండ, జగ్గయ్యపేట ప్రాంతాలలో లభించాయి.
- వీరికాలంలో గ్రామపంచాయితీలకు అధిపతిగా తల్వారిలను పిలుస్తారు.
- శ్రీలంక రాజులు శ్రీలంక బౌద్ద సన్యాసుల కొరకు నాగార్జున కొండ వద్ద సింహాళ విహారమును నిర్మించారు.
- ధ్వని విజ్ఞాన కేంద్రం / ప్రేక్షాగారం నాగార్జున కొండపై నిర్మించడం జరిగింది.
ఇక్ష్వాకుల సామ్రాజ్యం | |
---|---|
గొప్పరాజు | వీరపురుషదత్తుడు |
చివరి రాజు | రుద్రపురుషదత్తుడు |
రాజధాని | విజయపురి |
రాజమతం | శైవం |
రాజభాష | ప్రాకృతం |
స్వర్ణయుగం | బౌద్దమతం |
రాజలాంచనం | సింహాం |
ఆరాద్యపురుష దైవం | కార్తికేయ స్వామి |
ఆరాద్య స్త్రీ దైవం | హరితి/సంతాన దేవి |
రాజ్యస్థాపకుడు | శ్రీ శాంతములుడు |
పరిపాలన | సుమారు 75 సంవత్సరాలు |
Also Read :
Telangana History : Satavahana Dynasty in telugu |
---|
Telangana History : Qutub Shahi Dynasty in telugu |
---|
Telangana History : Kakatiya Dynasty in telugu |
---|
0 Comments