
కుతుబ్ షాహీలు సామ్రాజ్యం
Tspsc Telangana History : కుతుబ్ షాహీలు తెలంగాణలోని గోల్గోండను రాజధానిగా చేసుకొని 1512-1687 వరకు దాదాపు 175 సంవత్సరాలు పరిపాలించినారు. మహ్మద్ కులీకుతుబ్‌షా కాలంలో ఈ గోల్కోండను రెండవ ఈజిప్టు అని పిలిచేవారు. కుతుబ్‌షాహిల రాజ్యాన్ని 7 మంది సుల్తానులు పరిపాలించారు. కుతుబ్‌షాహీ రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీకుతుబ్‌షా. గొప్పరాజుగా మహ్మద్ మహ్మద్ కులీకుతుబ్‌షాహీ పేరుగాంచారు. ఈ రాజ్యానికి చివరి రాజు హసన్‌తానీషా. వీరు కారాకునేలు జాతికి చెందినవారు. మొట్టమొదటి సారిగా గోల్కొండ కోట నిర్మాణం చేపట్టిన వారు కాకతీయులు. గోల్కోండకు పూర్వనామాలు మంగళారం, మంకాళ్‌కోట, గొల్లకొండ, వజ్రాలగని అని పిలిచేవారు.
కుతుబ్‌షాహీల సామ్రాజ్యాన్ని మొత్తం 7 మంది రాజులు పరిపాలించారు. ఇందులో కుతుబ్‌షాహీ రాజ్యాన్ని స్థాపించిన వాడు కులీ కుతుబ్ షాహి. అలాగే గొప్ప రాజుగా మహ్మద్ కులీ కుతుబ్ షా పేరుగాంచాడు. ఈ రాజ్యాన్ని చివరిసారిగా హబుల్ హసన్ తానీషా పరిపాలించాడు.
కుతుబ్‌షాహీల సామ్రాజ్యాన్ని మొత్తం 7 మంది రాజులు పరిపాలించారు. ఇందులో కుతుబ్‌షాహీ రాజ్యాన్ని స్థాపించిన వాడు కులీ కుతుబ్ షాహి. అలాగే గొప్ప రాజుగా మహ్మద్ కులీ కుతుబ్ షా పేరుగాంచాడు. ఈ రాజ్యాన్ని చివరిసారిగా హబుల్ హసన్ తానీషా పరిపాలించాడు.
1) కుతాబ్ ఉల్‌ముల్క్ / సుల్తాన్ కులి (1512 - 1543)
- ఇతను కుతుబ్‌షాహీల సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటిరాజు. ఇతను షియా మతానికి చెందినవాడు.
- గోవా పాలకుడైన బహుదూర్ జిలాని గోల్కొండపై 1493 లో తిగురుబాటు చేయగా దానిని సుల్తాన్ కులీ ఓడించాడు.
- కులీకుతుబ్ ఉల్‌ముల్క్ అనే బిరుదుతో 1496 లో గోల్కొండపై తరరుఫ్ దారుగా నియమించాడు.
- మహమూద్ కాలంలోనే కులీ గోల్కొండ కేంద్రంగా సుల్తాన్ అనే బిరుదుతో 1512 లో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నట్లుగా నిజామి మసీదు శాసనం ద్వారా తెలుస్తుంది.
- ఇతను గోల్కొండ కోట నిర్మాణం ప్రారంభం చేసినాడు.
- గోల్కొండ కోట ప్రక్కన జుమామజీద్ నిర్మించాడు.
- ఇతను గోల్కొండకు మహ్మద్‌నగరం, మంగళవరం, గొల్లకోట అనే పేర్లు పెట్టడం జరిగింది.
- ఇతనికి బడేమాలిక్, ఖవాస్ ఖాన్, అమర్-ఉల్-ఉమ్రా, కుతుబ్ -ఉల్-ముల్క్ అనే బిరుదుల కలవు. ఇతనికి ఆరుగురు కుమారులున్నారు. వీరిలో 3వ కుమారుడు జంషీద్. 6వ కుమారుడు ఇబ్రహీం కుతుబ్షా
- మొదట ఆలియరామరాయలు ఈ రాజు వద్ద సేనాపతిగా పనిచేశాడు.
- ఇతనికి శ్రీకృష్ణదేవరాయలు, బాబర్, హుమాయున్‌ఇ సమకాలీకులుగా ఉన్నారు.
- ఇతని తర్వాత జంషీద్ అధికారంలోకి వచ్చాడు.
- 3వ మహమ్మద్ షా ఇతన్ని గోల్కొండకు గవర్నర్‌గా నియమించాడు. అలాగే ఇతనికి కుతుబ్-ఉల్-ముల్క్ అనే బిరుదుని ఇచ్చాడు.
2) జంషీద్ కులీ కుతుబ్‌షా (1543-1550)
ఇతను కోపంలో క్రూరత్వాన్ని ప్రదర్శించేవాడని ఫెరిస్టా రచనల వల్ల తెలుస్తుంది. చిన్నచిన్న తప్పులకు మరణశిక్షలు విధించేవాడు. ఇతని భయపడి ఇబ్రహీం కులీ కుతుబ్‌షా గోల్కొండ రాజ్యాన్ని వదిలి విజయనగర రాజ్యానికి వెళ్లిపోయాడు. జంషీద్ కులీ కుతుబ్ షా ‘‘రాజయక్ష్మ’ అనే వ్యాదితో మరణించడం జరిగింది.
Tspsc Telangana History :
3) ఇబ్రహీం కుతుబ్‌షా (1550-1980)
ఇతను మొదటిసారిగా "షా" అనే బిరుదును ధరించినాడు. ఇతను 7 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యంలో తలదాచుకున్నాడు. ఇతనికి మల్కిభరాముడు, ఉర్దూ చాజర్, షా అనే బిరుదులున్నాయి. ఇతని కాలంలో హుస్సెన్‌సాగర్, ఇబ్రహీంపట్నం చెరువు, గోల్కొండ దుర్గం చుట్టు ప్రహారీగోడ, పూల్‌బాగ్ తోట, ఇబ్రహీంబాగ్, మూసీ నదిపై పురానాపూల్, లంగర్లు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇతని కాలంలో రాజ్యానికి ఆస్థాన కవులుగా పొన్నెగంటి తెలగనార్యుడు, అద్దంకి గంగాధరుడు, కందుకూరి రుద్రకవిలు పనిచేశారు. ఇతను ‘‘ఆషిఖానా’’ లో కవితా గోష్టిని నిర్వహించేవాడు. ఇతని కాలంలో ఉర్ధూభాషా బాగా అభివృద్ది చెందింది. అందువల్ల ఇతనిని ఉర్దూ పితామహునిగా పిలుస్తారు. ఇతనికి ఆరుగురు కుమారులు, ఒక కుమార్తెలున్నారు. ఇతని మేనల్లుడు హుస్సెన్ షా / హుస్సెన్ నిజాం షా ‘‘హుస్సెన్ సాగర్ ’’ ను 1564లో నిర్మించాడు. ఇతని కాలంలో గోల్కొండను రెండవ ఈజిప్టుగా పిలవడం జరిగింది. తన శత్రువైన జగదేవ్ రావుకు ఆలియారామరాయలు ఆశ్రయం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇబ్రహీం రామరాయలకు వ్యతిరేకంగా 1565 లో తల్లికోట యుద్దంలో పాల్గొన్నాడు. ఈ తల్లికోట యుద్దంలో ‘‘తోప్’’ అనే కొత్త ఫిరంగులను వాడి విజయం సాధించాడు. ఇతని రాజ్యవిస్తరణకు హైదర్ ఉల్ ముల్క్, మురారీరావు అనే సేనాపతులు ముఖ్యపాత్ర పోషించారు. మురారీరావు అహోబిలం దేవాలయంపై దండేత్తి అక్కడ నరసింహ దేవాలయంలోని బంగారు, వెండి విగ్రహాలను దోచుకున్నాడు. ఇతను భగీరథిదేవి అనే హిందు స్త్రీని వివాహం చేసుకున్నాడు. గోల్కొండకు భగీరథీ నగరంగా పేరుపెట్టారు. అలీబిన్ అజీజుల్లా అనే చరిత్రకారుడు ఇతను న్యాయ విధానంలో ప్రపంచ రాజులకు ఆదర్శప్రాయుడిగా నిర్వచించాడు.
4) మహమ్మద్ కులీ కుతుబ్ షా (1580 -1612)
ఇతను కుతుబ్‌షాహిల రాజులందరిలో గొప్పరాజు పేరుగాంచాడు. ఇతను చార్మినార్ మరియు హైద్రాబాద్ నగర నిర్మాతగా కీర్తి సాధించాడు. ఇతనికి అక్భర్, 2వ వెంకటపతిరాయలు సమకాలీలుగా ఉన్నారు. అక్భర్ తన రాయబారిగా మసూద్ బేగ్‌ను ఆస్థానానికి పంపాడు. ఇతని కాలంలో గోల్కొండ యావత్ ఆంధ్రదేశానికి రాజధాని అయింది. ఇతని పాలనా కాలాన్ని గోల్కొండ చరిత్రలో స్వర్ణయుగం అని పిలుస్తారు. ఇతను చెంచెలం గ్రామానికి చెందిన భాగమతి అనే హిందూ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చెంచెల(ప్రస్తుతం షాలిబండ) గ్రామంలో వచ్చిన ప్లేగు వ్యాదిని నిర్మూలించడానికి 1591-93 వరకు నాలుగు రోడ్ల కూడలి మద్య చార్మినార్ అనే చారిత్రాత్మక కట్టడాన్ని నిర్మించారు. ఈ చార్మినార్ యొక్క రూపశిల్పి మీర్ మోమీస్ అస్త్రబాది. తెవనాట్ అనే ఫ్రెంచ్ వైద్యుని ప్రకారం హైద్రాబాద్ నగరం ఉద్యానవనాలతో (భాగ్) నిండి ఉంది. అందువల్ల భాగ్యనగరం అని పిలిచారు.
ఇతని కాలంలో అనే కట్టడాలు నిర్మించారు. అవి.
1) జుమామసీద్
2) గోదామహాల్
3) చందనమహల్
4) చార్మినార్
5) చార్ కమాన్
6) దారుల్ షిషా (ఆరోగ్య కేంద్రం)
7) దాద్ మహల్ (న్యాయస్థానం)
8) కుదామహల్
- ఇతని పాలనాకాలంలో 1611 లో గ్లోబ్ అనే ఆంగ్లనౌక హిప్స్‌స్ నాయకత్వంలో మచిలీపట్నం చేరుకోగా బ్రిటిష్‌వారికి 1612 లో వ్యాపార అనుమతి ఇచ్చాడు. గోల్కొండ రాజ్యంలోకి యూరప్ వర్తకుల ప్రవేశం ఇతని కాలంలోనే ప్రారంభమైనది.
- ఇతను ఉర్దూలో స్వయంగా ‘‘మానీ’’ అనే కలం పేరుతో కులియర్ కులి అనే గీతాలను సంకలనం చేశాడు. ఇది దక్కన్ ఉర్దూలో వ్రాయబడిన మొదటి గ్రంథం. ఇతను పద్మావతి గ్రంథాన్ని ఉర్దూలోకి అనువందించాడు.
- ఇతను మూసీనిదికి (ముచ్చుకుందా) ఆనకట్టను నిర్మించి హైద్రాబాద్ ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు.
- ఇతని ఆస్థానంలో సారంగ తమ్మయ్య (రెవెన్యూ అధికారి), మల్లరెడ్డి, చెదిగొండ నరసింహ, వెళ్లుట్ల నారాయణ కవులు ఉండేవారు.
5) మహమ్మద్ కుతుబ్ షా (1612 - 1626)
- ఇతను మహమ్మద్ కులీ కుతుబ్ షా తమ్ముని కుమారుడు. ఇతని భార్య హయద్ భక్షి. ఇతనికి మొఘల్ రాజు జహాంగీర్ సమకాలీనుడిగా ఉన్నాడు. హైద్రాబాద్‌కు తూర్పున సుల్తాన్ నగరం అనే పేరుతో మరో నగరంను నిర్మించాడు.
- ఇతను చార్మినార్ సమీపంలో మక్కామసీదుకు పునాదివేయగా 77 సంవత్సరాలు కొనసాగి 1694 లో ఔరంగజేబు పూర్తి చేశాడు. షేర్వాణి పండితుడు ఈ మక్కామసీదును ఢిల్లీ లోని జుమా మసీదుతో పోల్చడం జరిగింది. ఇతని ఆస్థానాన్ని పారశీక రాయబారి ‘‘మీర్ జైనుల్ అభిదిస్ ’’ సందర్శించడం జరిగింది.
- ఇతని పాలనా కాలంలో ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు హైద్రాబాద్‌లో పర్యటించి మక్కా మసీద్ గురించి వివరించడం జరిగింది.
- ఇతని ఆస్థానాన్ని సందర్శించిన జహంగీర్ రాయబారి మీర్ మక్కీ
- మీర్ మహ్మద్ మొమీన్ ఆష్రబాది - రిసాల-మిగ్ దారియా (తూనికల కొలతలపై వ్రాసిన గ్రంథం)
- అకిమ్ తకియుద్దీన్ - మిజామల్ తబాయి కుతుబ్ షామి (వైద్యశాస్త్ర గ్రంథం) అనే వారు ఇతని కాలంలో ఆస్థాన కవులుగా పనిచేశారు.
- మహమ్మద్ కుతుబ్ షా 1622 లో మచిలీపట్నంలో ఆంగ్లేయులు వర్తకం చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు.
- ఇతనికి ఖురాన్ గ్రంథంపై ఎక్కువ అభిమానం ఉండేది. అందులోని సూత్రాల ఆధారంగా పరిపాలన కొనసాగించేవాడని పేర్కొంటారు. చివరికి ఖురాన్‌ను వింటూనే మరణించినాడు.
- ఇతను ఖైరతాబాద్‌లో మసీదును నిర్మించాడు.
6) అబ్దుల్లా హుస్సెన్ కుతుబ్ షా (1626-1672)
- ఇతను మహమ్మద్ కుతుబ్‌షా యొక్క కుమారుడు.
- కేవలం 12 సంవత్సరాల మైనర్ దశలో సింహసానాన్ని అధిష్టించాడు.
- ఇతని తల్లి హయద్ భక్షి ఇతనికి సంరక్షకురాలుగా పరిపాలన కొనసాగించింది. ఇతని తల్లి హయత్ భక్షి పేరుమీదుగానే హయత్‌నగర్ నిర్మించడం జరిగింది. దానధర్మాలు చేయడం వల్ల హయత్ భక్షిని ‘‘మా సాహెబు ’’ అని పిలిచేవారు.
- 1636 లో షాజహాన్ చేతిలో ఓడిపోయి సాలుకు 2 1/2 లక్షల రూపాయలు చెల్లించేటట్లుగా ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత అబ్దుల్ లతీఫ్ అనే మొగల్ రాయబారి ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందం ప్రకారం మొగలులకు సామంతుడిగా మారాడు.
- ఇతని ప్రధాని మీర్ మహమ్మద్ సయ్యద్ "కోహినూర్" వజ్రంను కోలార్ / కోలార్ గనుల నుండి తెప్పించి షాజహాన్‌కు బహుమానంగా ఇవ్వడం జరిగింది.
- 1656 లో ఔరంగజేబు చేతిలో ఓడిపోయి ఇతని కుమార్తెను ఔరంగజేబు కుమారుడు మహమ్మద్‌కు ఇచ్చి పెళ్లిచేసాడు.
- 1670 లో గోవా క్రైస్తవ సన్యాసులు మచిలీపట్నంలో చర్చి నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.
- ఆంగ్ల వ్యాపారులను రప్పించడానికి 1634లో అబ్దుల్లా "గోల్డెన్ ఫర్మానా"ను జారీచేశాడు.
- ఇతని పరిపాలన కాలాన్ని ఉర్దూ సాహిత్యానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు.
- గవాసి (తూతినామా), క్షేత్రయ్య (మొవ్వ పదాలు) అనే వారు ఆస్థాన కవులుగా పనిచేశారు.
Tspsc Telangana History :
7) అబ్దుల్లా హసన్ తానీషా
- ఇతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తెను ఔరంగజేబు కుమారుడు మహమ్మద్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు. రెండవ కుమార్తెను పర్షియా యువరాజు నిజాముద్దీన్ అహ్మద్‌కు ఇచ్చి పెళ్లిచేశాడు. మూడవ కుమార్తెను అబుల్ హసన్‌కు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది.
- ఇతని సూఫి గురువు ‘‘షా రజు కట్టాల్ ’’ ఇతనికి తానీషా (భోగి) అనే బిరుదును ఇచ్చాడు.
- అక్కన్న (సర్-ఇ-లష్కర్ - సేనాపతి) మరియు మాదన్న (మీర్ జుమ్లా (ప్రధాని) - సూర్య ప్రకాశ్ అనే బిరుదు కలదు) అనే హిందూ అన్నదమ్ములు అబుల్ హసన్ తానీషా అధికారంలోకి రావడానికి సహకరించినారు. అక్కన్న, మాదన్నలు తమ ముగ్గురి అల్లుళ్లకు ఉన్నత ఉద్యోగాలు ఇప్పించారు.
ఎ) వెంకన్న - సేనాపతి (ఇతని బిరుదు రుస్తుంరావ్)
బి) పొదిరి లింగన్న - కర్నాటిక్ గవర్నర్
సి) కంచర్ల గోపన్న - పాల్వంచ తహశీల్దార్
- 1676 లో అక్కన్న మరియు మాదన్నలు బీజాపూర్ సుల్తాన్, శివాజీలతో తానీషాకు సంధి కుదిర్చారు. 1677 లో శివాజీ గోల్కొండను సందర్శించారు.
- 1686 లో ఔరంగజేబు సేనాధిపతి షేక్ మన్సాప్ అక్కన్న మరియు మాదన్నలను హత్య చేయించాడు.
- గోల్కొండ కోట ముట్టడి
- మొఘల్‌పురా - గోల్కొండకు వచ్చినప్పుడు మొగలుల సైన్యాలు బసచేసిన ప్రాంతం
- హోషమహల్ - గుర్రాలను నిలిపిన ప్రదేశం
- ఫతే మైదాన్ - వీరి మద్య యుద్ద జరిగిన మైదానం
➙ అబ్దుల్లా పాని :
ఎ) 1687 లో గోల్కొండ ముట్టడిలో ఔరంగజేబుకు సహకరించిన వ్యక్తి.
బి) ఔగరంజేబు వద్ద లంచం తీసుకొని గోల్కొండ తూర్పు కోట ద్వారము తెరిపించాడు.
➙ అబ్దుల్ రజాక్ లౌరి (ముస్తాఫాఖాన్) :
ఎ) ఇతను కోట పశ్చిమ ద్వారా అధికారి
బి) విరోచితంగా ఔరంగజేబు సైన్యంతో పోరాటి మరణించాడు.
గోల్కొండ కోట ముట్టడి తర్వాత అబ్దుల్లా హసన్ తానీషాను దౌలతాబాద్ కోటకు బందీగా తీసుకెళ్లాడు. అక్కడే 1699 లో మరణించాడు.
కుతుబ్‌షాహి సామ్రాజ్య రాజుల వరుస క్రమం |
---|
1) కుతుబ్ ఉల్‌ముల్క్ (1512 - 1543) |
2) జంషిద్ (1543 - 1550) |
3) ఇబ్రహీం కుతుబ్ షా (1550 - 1580) |
4) మహ్మద్ కులికుతుబ్ షా (1580 - 1612) |
5) మహ్మద్ కుతుబ్‌షా (1612 - 1626) |
6) అబ్దుల్లా హుస్సెన్ కుతుబ్‌షా (1626 - 1672) |
7) హబుల్ హసన్ తనిషా (1672 - 1687) |
ఇందులో కుతబ్‌షాహిల సామ్రాజ్యాన్ని ఎక్కువకాలం పరిపాలించిన రాజు అబ్దుల్లా హుస్సెన్ కుతుబ్ షా. |
గొప్పరాజుగా మహ్మద్ కులీ కుతుబ్‌షా పేరుగాంచాడు. |
కుతుబ్‌షాహిల సాహిత్యం | |
---|---|
కందుకూరి రుద్రకవి | సుగ్రీవ విజయం, జనార్ధన వాష్టికం, |
అద్దంకి గంగాధరుడు | యయాత్రి చరిత్ర |
మురగంటి సింగనాచార్యుడు | దశరాథ నందన చరిత్ర |
మీర్ మెమోన్ అస్త్రచరి | రిసాల మెర్దారియా |
అకిమ్‌తకియోద్దీన్ | మిజామున్ తచాయి |
రాజభాష | పర్షియన్ |
స్థాపకుడు | కులీకుతుబ్ షాహి |
గొప్ప రాజు | మహ్మద్ కులీ కుతుబ్‌షా |
చివరి వాడు | హబుల్ హసన్ తానీషా |
జన్మస్థలం | మద్యఆసియా |
రాజమతం | ఇస్లాం (షియా) |
దేశం | ఇరాన్ |
జాతి | హందం |
తెగ | కురుకునేల్ |
Also Read :
Telangana History : Satavahana Dynasty in telugu |
---|
Telangana History : Kakatiya Dynasty in telugu |
---|
Telangana History : Ikshavku Dynasty in telugu |
---|
0 Comments