IB Recruitment 2023 in Telugu || Apply Online 677 Posts || ఇంటలిజెన్స్‌ బ్యూరో జాబ్స్‌ || Jobs in Telugu || Latest Jobs in Telugu

IB Recruitment 2023 in Telugu || Apply Online 677 Posts || ఇంటలిజెన్స్‌ బ్యూరో జాబ్స్‌

ఇంటలిజెన్స్‌ బ్యూరో జాబ్స్‌ 
IB Recruitment 2023 Apply Online, Notification | 677 Security Assistant, MTS Posts || Jobs in Telugu || Latest Jobs in Telugu 


కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో  ఖాళీగా ఉన్న 677 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 362 సెక్యూరిటీ అసిస్టెంట్‌ / మోటార్‌ ట్రాన్‌పోర్టు, 315 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌లు పోస్టులు భర్తీ చేయనున్నారు. 

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలోని 677 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో 13 నవంబర్‌ 2023 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు 18 నుండి 25 సంవత్సరాలున్న అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు. 677 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌ (404), ఓబీసీలకు (125), ఎస్సీలకు (34), ఎస్టీలకు (55), ఈడబ్ల్యూఎస్‌లకు 59 ఉన్నాయి. సెక్యూరిటీ అసిస్టెంట్‌ / మోటార్‌ ట్రాన్స్‌పోర్టు పోస్టులకు పదోతరగతితో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కల్గి ఉండాలి. మరియు సంవత్సరం పని అనుభవంతో పాటు మోటార్‌ మెకానిజం పరిజ్ఞానం ఉండాలి. వయస్సు 27 సంవత్సరాలు మించరాదు. అలాగే ఎంటీఎస్‌ పోస్టులకు, అభ్యర్థుల పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. పరీక్ష విధానం ఆన్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక అనేది వ్రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్య పరీక్ష ద్వారా చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో అనంతపురం, చీరాల, గుంటూర్‌, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైద్రాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాలలో పరీక్షా కేంద్రాలు కలవు. 


➺ మొత్తం పోస్టులు :

సెక్యూరిటీ అసిస్టెంట్‌ / మోటార్‌ ట్రాన్స్‌పోర్టు లో 362, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌లు 315 మొత్తం 677 పోస్టులున్నాయి. 

అన్‌రిజర్వుడ్‌ (404)

ఓబీసీలకు (125)

ఎస్సీలకు (34)

ఎస్టీలకు (55)

ఈడబ్ల్యూఎస్‌లకు (59)


➺ విద్యార్హత :

సెక్యూరిటీ అసిస్టెంట్‌ / మోటార్‌ ట్రాన్స్‌పోర్టు పోస్టులకు  

  • పదవ తరగతిలో ఉత్తీర్ణత 
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ 
  • ఒక సంవత్సరం పని అనుభవం 
  • మోటారు మెకానిజంలో ప్రావీణ్యం 
  • వయస్సు 27 సంవత్సరాలు మించరాదు. 

ఎంటీఎస్‌ పోస్టులకు 

  • 10వ తరగతిలో ఉత్తీర్ణత
  • వయస్సు 18-25 సంవత్సరాలు 


➺ ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష 
  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ 
  • వైద్య పరీక్షలు 


➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


➺ పరీక్షా కేంద్రాలు :

ఆంధ్రప్రదేశ్‌లో 

  • అనంతపురం
  • చీరాల
  • గుంటూర్‌
  • కడప
  • కాకినాడ 
  • కర్నూలు 
  • రాజమహేంద్రవరం 
  • తిరుపతి 
  • విజయవాడ 
  • విశాఖపట్నం 
  • విజయనగరం 

తెలంగాణలో 

  • హైదరాబాద్‌ 
  • కరీంనగర్‌ 
  • ఖమ్మం 
  • మహబూబ్‌నగర్‌ 
  • వరంగల్‌ 


➺ ధరఖాస్తుకు చివరి తేది :

13 నవంబర్‌ 2023


For Online Apply 

Click Here


Related Posts 



Post a Comment

0 Comments