Jawahar Navodaya Vidyalaya Admission in Telugu || Lateral Entry Admission Class 6, Class 11 || Admissions in Telugu || Latest Jobs in Telugu

Jawahar Navodaya Vidyalaya Admission in Telugu

 Jawahar Navodaya Vidyalaya Admission in Telugu || Lateral Entry Admission Class 6, Class 11 ||  Admissions in Telugu || Latest Jobs in Telugu 

నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కొరకు లేటరల్‌ ఎంట్రీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా 9వ, 11వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. సెలక్షన్‌ టెస్టు ద్వారా ప్రవేశాల కల్పిస్తారు. జవహర్‌ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 650 స్కూల్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 09, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 15 ఉన్నాయి. నవోదయ విద్యాయాల్లో కో-ఎడ్యూకేషన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు. కానీ బాలబాలికలకు విడివిడిగా హస్టల్‌ సదుపాయం ఉంటుంది. ఇందులో అడ్మిషన్‌ పొందిన వారికి ఉచితంగా వసతి, రుచిరకమైన భోజనం, యూనిఫారమ్‌, పాఠ్యపుస్తకాలు ఇస్తారు. ఇందులో మెథమేటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టులను ఇంగ్లీష్‌మీడియంలో, సోషల్‌ సైన్స్‌ను హిందీ/ఇంగ్లీష్‌ మీడియంలో భోదిస్తారు. ఇందులోని విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌ ఉంటుంది. ప్రతి సంవత్సరం సీబీఎస్‌సీ నిర్వహించే వార్షిక పరీక్షలను రాయాల్సి ఉంటుంది. 

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లోని లెటరల్‌ ఎంట్రి కొరకు 8వ / 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అన్‌లైన్‌ ధరఖాస్తు చేసుకోవాలి. 31 అక్టోబర్‌ 2023 లోగా ఆన్‌లైన్‌ ధరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2024 లో నిర్వహించే పరీక్ష యొక్క హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ నుండి ధరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష పూర్తి అయిన తర్వాత తుది ఫలితాలను జూన్‌ 2024 లో వెల్లడిస్తారు. జవహర్‌ నవోదయ విద్యాలయాల్లోని లెటరల్‌ ఎంట్రీకొరకు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో సైన్స్‌ / కామర్స్‌ గ్రూప్‌లలో సీట్లు ఖాళీగా ఉన్నాయి. 


➺ JNV ఖాళీగా ఉన్న సీట్లు ఎన్ని ?

➧ 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లు :

తెలంగాణలో 

  • ఆదిలాబాద్‌ - 09
  • కరీంనగర్‌ - 05
  • ఖమ్మం - 06
  • మహబూబ్‌నగర్‌ - 09
  • మెదక్‌ - 08
  • నల్లగొండ - 07
  • నిజామాబాద్‌ - 16
  • రంగారెడ్డి - 09
  • వరంగల్‌ - 04


Also Read : Gk Questions in Telugu

 

ఆంధ్రప్రదేశ్‌లో 

  • అనంతపురం - 14
  • చిత్తూర్‌ - 19
  • తూర్పు గోదావరి - 10
  • గుంటూర్‌ - 11
  • కడప - 09
  • కృష్ణ - 12
  • కర్నూలు - 06
  • నెల్లూర్‌ - 13
  • ప్రకాశం - 28
  • శ్రీకాకుళం - 16
  • విశాఖపట్నం - 11
  • విజయనగరం - 08
  • పశ్చిమగోదావరి - 08
  • అల్లూరి సీతారామరాజు - 02


➧ 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లు :

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోగల అన్ని జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో సైన్స్‌ గ్రూప్‌ సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఖమ్మం, చిత్తూర్‌, గుంటూర్‌ విద్యాలయాల్లో కామర్స్‌ గ్రూప్‌ సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 

➺ జవహర్‌ నవోదయ విద్యాలయాలు (JNV) అర్హత :

9వ తరగతి 
  • ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 
  • 01 మే 2009 నుండి 11 జూలై 2011 మధ్య జన్మించాలి 

11వ తరగతి 
  • ప్రస్తుతం 10వ తరగతి చదువుతుండాలి 
  • 01 జూన్‌ 2007 నుండి 31 జూలై 2009 మధ్య జన్మించాలి  

JNV ఎంపిక ప్రక్రియ :

జవ హర్‌ నవోదయ పరీక్షను అబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రాలు 
తెలంగాణ 
  • హైద్రాబాద్‌ 
  • మెదక్‌
  • నల్గొండ
  • అదిలాబాద్‌
  • కరీంనగర్‌
  • ఖమ్మం, కొత్తగూడెం 
  • నిజామాబాద్‌ 
  • సూర్యాపేట 
  • వరంగల్‌ 

ఆంధ్రప్రదేశ్‌
  • చీరాల 
  • చిత్తూర్‌ 
  • గూడూర్‌ 
  • గుంటూర్‌ 
  • కడప
  • నెల్లూర్‌ 
  • ఒంగోలు
  • తిరుపతి 
  • ఏలూరు 
  • కాకినాడ 
  • సూరంపాలెం 
  • రాజమహేంద్రవరం 
  • శ్రీకాకుళం 
  • తాడేపల్లిగూడెం 
  • విజయవాడ 
  • విశాఖపట్నం 
  • విజయనగరం, 
  • అనంతపూర్‌ 
  • కర్నూలు 


➺ JNV 9వ తరగతి పరీక్షా విధానం :

ఈ పరీక్షలో మొత్తం 100 బహుళైచ్చిక ప్రశ్నలుంటాయి. విద్యార్థులు ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో పరీక్షను వ్రాయాల్సి ఉంటుంది. హింధీ, ఇంగ్లీష్‌ మాద్యమాల్లో ఉండే ఈ పరీక్షను రెండున్నర గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 


➺ JNV 11వ తరగతి పరీక్ష విధానం :

11వ తరగతి ప్రవేశం కొరకు నిర్వహించే ఈ పరీక్షలో మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లీష్‌, సోషల్‌ సైన్స్‌, మేథమెటిక్స్‌ సబ్జెక్టుల నుండి ఒక్కోదానిలో నుండి 20 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత పొందాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం మార్కులు రావాలి. అభ్యర్థుల మెరిట్‌ జాబితా రూపొందించేందుకు సైన్స్‌ గ్రూప్‌ అభ్యర్థులకు మెంటల్‌ ఎబిలిటీ, సైన్స్‌, మేథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను, కామర్స్‌ గ్రూప్‌ అభ్యర్థులకు మెంటల్‌ ఎబిలిటీ, సోషల్‌ సైన్స్‌, మేథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. 


➺ ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌ ధరఖాస్తులు ముగింపు తేది - 31 అక్టోబర్‌ 2023
పరీక్ష తేది - 10 ఫిబ్రవరి 2024
పరీక్షా ఫలితాలు - జూన్‌ 2024


కెటగిరి అడ్మిషన్స్‌
నిర్వహించు సంస్థ నవోదయ విద్యాలయ సంస్థ
పేరు జవహర్‌ నవోదయ విద్యాలయం
దేశం ఇండియా
ఎక్కడ దేశవ్యాప్తంగా
తరగతులు 9వ, 11వ
ధరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
పరీక్ష విధానం ఓఎంఆర్‌ (ఆఫ్‌లైన్‌)
ఎంపిక ప్రక్రియ మెరిట్‌ ఆధారంగా
విద్యార్హత 8వ / 10వ తరగతి ఉత్తీర్ణత
ఆన్‌లైన్‌ ధరఖాస్తు ముగింపు Nov 7, 2023
పరీక్ష 10 ఫిబ్రవరి 2024
పూర్తి సమాచారం కొరకు Click Here
ఆన్‌లైన్‌ ధరఖాస్తుల కొరకు Click Here


Related Posts :





Post a Comment

0 Comments