Banking Sector in India in Telugu || Gk in Telugu || General Knowledge in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk in Telugu, Bank (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
➺ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) :
భారత రిజర్వ్‌బ్యాంక్‌ను జె.ఎమ్.క్వీన్స్ ప్రణాళిక ఆధారంగా ఆర్‌బిఐ చట్టం 1934 ప్రకారం 1935 ఏప్రిల్ 1వ తేదీన 5 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేశారు. దీనినే భారతదేశ కేంద్ర బ్యాంకు అంటారు. భారత రిజర్వ్ బ్యాంకును 1949 సంవత్సరంలో జాతీయం చేశారు. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో కలదు. ఆర్‌బిఐ మొట్టమొదటి గవర్నర్‌గా ఒస్టర్స్‌స్మిత్ నియమితులయ్యారు. ఆర్‌బిఐకి మొట్టమొదటి భారతీయ గవర్నర్‌గా సి.డి. దేశ్‌ముఖ్ పనిచేశారు. ఆర్‌బిఐ గవర్నర్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నియమిస్తారు. ఇందులో మొత్తం 20 మంది సభ్యులు లుంటారు. (గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్‌లు, 15 మంది డైరెక్టర్లు) ఇది భారతదేశ ద్రవ్య మార్కెట్‌లో ప్రధాన భూమిక పోషిస్తుంది. భారత కరెన్సీ ఆర్‌బిఐ తయారు చేస్తుంది. ఆర్‌బిఐ ఒక్క రూపాయి నోటు తప్ప మిగతా అన్ని కరెన్సీలను ముద్రిస్తుంది. ఒక రూపాయి నోటు మరియు నాణేలను ముంద్రించే అధికారం కేంద్ర ఆర్థిక శాఖకు ఉంటుంది. ఒక్క రూపాయి నోటుపై ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సంతకం ఉంటుంది. మిగిలిన అన్ని కరెన్సీలపై ఆర్‌బిఐ గవర్నర్ సంతకం ఉంటుంది. ఆర్‌బిఐ ముద్రించిన మొదటి కరెన్సీ నోటు 5 రూపాయలు కాగా మొదటి ప్లాస్టిక్ కరెన్సీ నోటు 10 రూపాయలు. వాణిజ్యబ్యాంకులకు ఆర్‌బిఐ ఏ రేటును పరిమితిని అందజేస్తుందో ఆ రేటునే బ్యాంక్ రేటు అంటారు.
రెపోరేటు
రిజర్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై విధించే వడ్డీరేటునే రేపోరేటు అంటారు. ఈ రెపో రేటును వాఘల్ వర్కింగ్ గ్రూపు సిఫార్సుల మేరకు 1992 నుండి అమలు చేశారు.
రివర్స్ రెపోరేటు
ఆర్‌బిఐ వాణిజ్య బ్యాంకుల వద్ద తీసుకునే స్వల్పకాలిక రుణాలపై నిర్ణయించే వడ్డీరేటునే రివర్స్ రెపోరేటు అంటారు. ఈ రివర్స్‌రెపో రేటును వాఘల్ వర్కింగ్ గ్రూపు సిఫార్సుల మేరకు 1996 నుండి అమలు చేశారు.
Also Read : Gk Questions in Telugu
బ్యాంకుల జాతీయీకరణ
19 జూలై 1969 రోజున అప్పటి భారత ప్రధాన ఇందిరాగాంధీ 50 కోట్లు అంతకుమించి డిపాజిట్లు ఉన్న 14 షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. తర్వాత 1980 సంవత్సరంలో మరో 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. దీంతో మొత్తం జాతీయం చేసిన బ్యాంకులు 20కు చేరింది. 04 సెప్టెంబర్ 1993 రోజున న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేయడంతో జాతీయ చేసిన బ్యాంక్‌ల సంఖ్య 20 నుండి 19కి తగ్గింది. 01 ఏప్రిల్ 2019 రోజున ఈ యొక్క 19 వాణిజ్య బ్యాంకులలో కొన్ని బ్యాంకులను ఇతర బ్యాంకులలో విలీనం చేయడం జరిగింది.
19 జూలై 1969 రోజున జాతీయం చేసిన 14 వాణిజ్య బ్యాంకుల వివరాలు
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
- స్థాపన : 1908
- ప్రధాన కార్యాలయం : బరోడా
- విదేశాలలో అధిక శాఖలు కల్గిన బ్యాంకు
- విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి.
2) బ్యాంక్ ఆఫ్ ఇండియా
- స్థాపన : 1906
- ప్రధాన కార్యాలయం : ముంబాయి
- తొలిసారి విదేశాలలో బ్రాంచ్ ఏర్పాటు చేసింది.
3) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- స్థాపన : 1935
- ప్రధాన కార్యాలయం : పుణె
4) ఇండియన్ బ్యాంక్
- స్థాపన : 1907
- ప్రధాన కార్యాలయం : చెన్నై
- అలహబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంక్‌లో విలీనం చేసారు.
5) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- స్థాపన : 1911
- ప్రధాన కార్యాలయం : ముంబాయి
6) పంజాబ్ నేషనల్ బ్యాంక్
- స్థాపన : 1895
- ప్రధాన కార్యాలయం : న్యూఢల్లీి
- దీనిని లాలా లజపతిరాయ్ స్థాపించారు.
- ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేశారు.
7) కెనరాబ్యాంక్
- స్థాపన : 1906
- ప్రధాన కార్యాలయం : బెంగళూరు
- సిండికెట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌లో విలీనం చేశారు.
8) యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్
- స్థాపన : 1943
- ప్రధాన కార్యాలయం : కోల్‌కతా
9) సిండికెట్ బ్యాంక్
- స్థాపన : 1925
- ప్రధాన కార్యాలయం : మణిపాల్
- ఇండియాలో తొలి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ను స్పాన్సర్ చేసింది.
- దీనిని కెనరాబ్యాంక్‌లో విలీనం చేశారు.
10) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- స్థాపన : 1950
- ప్రధాన కార్యాలయం : కోల్‌కతా
11) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- స్థాపన : 1919
- ప్రధాన కార్యాలయం : ముంబాయి
- మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడిన బ్యాంకు
- కార్పోరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లను యూనియన్ బ్యాంక్‌లలో విలీనం చేశారు.
12) దేనా బ్యాంక్
- స్థాపన : 1938
- ప్రధాన కార్యాలయం : ముంబాయి
- దీనిని బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు.
13) అలహాబాద్ బ్యాంక్
- స్థాపన : 1865
- ప్రధాన కార్యాలయం : కోల్‌కతా
- భారతదేశంలోని పురాతమైన బ్యాంక్
- అలహాబాద్ బ్యాంక్‌ను ఇండియన్ బ్యాంక్‌లో విలీనం చేశారు.
14) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
- స్థాపన : 1937
- ప్రధాన కార్యాలయం : చెన్నై
15 ఏప్రిల్ 1980 రోజున జాతీయం చేసిన 6 వాణిజ్య బ్యాంకుల వివరాలు
1) ఆంధ్రా బ్యాంక్
స్థాపన : 1923
ప్రధాన కార్యాలయం : హైదరాబాద్
మచిలీపట్నంలో 1923 లో డా॥భోగరాజు పట్టాభిసీతారామయ్య ఏర్పాటు చేశాడు.
2) విజయాబ్యాంక్
స్థాపన : 1931
ప్రధాన కార్యాలయం : బెంగుళూరు
ఏ.బి శెట్టి ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాడు.
3) కార్పోరేషన్ బ్యాంక్
స్థాపన : 1906
ప్రధాన కార్యాలయం : మంగుళూరు
ఆర్థిక ఫలితాలను పబ్లిష్ చేసిన తొలి బ్యాంక్
4) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
స్థాపన : 1943
ప్రధాన కార్యాలయం : New Delhi
ప్రైవేటు రంగం నుండి మూలధనం సమకూర్చుకున్న తొలిబ్యాంక్
5) పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
స్థాపన : 1908
ప్రధాన కార్యాలయం : New Delhi
6) న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈ బ్యాంక్ 1993 లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేశారు.
విలీనం అయిన తర్వాత ఉన్న బ్యాంకులు | |
---|---|
విలీనం చేసుకున్న బ్యాంక్ | విలీనం అయిన బ్యాంక్ |
కెనరా బ్యాంక్ | సిండికేట్ బ్యాంక్ |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
ఇండియన్ బ్యాంక్ | అలహాబాద్ బ్యాంక్ |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | ఆంధ్రా బ్యాంక్ కార్పోరేషన్ బ్యాంక్ |
బ్యాంక్ ఆఫ్ బరోడా | విజయాబ్యాంక్ దేనాబ్యాంక్ |
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ భారతీయ మహిళా బ్యాంక్ |
➺ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
- 1806 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ కలకత్తా, 1840 లో బ్యాంక్ ఆఫ్ బొంబాయి, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపించబడినవి.
- పై 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటైంది.
- 1955లో ఇంపీరియల్ బ్యాంక్‌ను జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు.
- భారత్‌లో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా
➺ బ్యాంకింగ్ గురించి మీకు తెలియని విషయాలు :
- రిజర్వ్ బ్యాంక్‌ను 01 ఏప్రిల్ 1935న ప్రారంభించారు. దీనిని 01 జనవరి 1949న జాతీయం చేశారు.
- ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ వెనిస్'
- ఇండియాలో పురాతన బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్
- ఇండియాలో స్థాపించిన మొదటి వాణిజ్య బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్.
- బ్యాంగ్ ఆఫ్ బెంగాల్ (మొట్టమొదటి ప్రెసిడెన్సీ బ్యాంక్)(బ్యాంక్ ఆఫ్ కలకత్తా) 1806 లో స్థాపించడం జరిగింది. ఈ బ్యాంక్ స్థాపనతో ప్రస్తుత భారత బ్యాంకింగ్ వ్యవస్థకు పునాది పడిరదని చెప్పవచ్చు.
- పూర్తి భారతీయ యాజమాన్యంతో రూపొందించబడిన మొట్టమొదటి బ్యాంక్ 1881లో స్థాపించబడిన ‘ఔద్ వాణిజ్యబ్యాంక్’ (దీనిని 1958లో మూసివేసినారు)
- ఇండియాలో మొదటిసారి కాగిత కరెన్సీ ముద్రించింది బ్యాంక్ ఆఫ్ బెంగాల్.
- 19 జూలై 1969 న 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు.
- 15 ఏప్రిల్ 1980 లో మరో 6 బ్యాంకులను జాతీయం చేశారు.
- విదేశాలలో అత్యధిక శాఖలు ఉన్న బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా
- మహాత్మాగాంధీతో ప్రారంభించబడిన బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
- విదేశాలలో మొట్టమొదటి సారిగా బ్రాంచ్‌ను ప్రారంభించిన బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
- 2 అక్టోబర్ 1975 న 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ప్రారంభించారు.
- భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అఖిల భారత అభివృద్ది బ్యాంకులు
➠ భారత పారిశ్రామిక విత్త సంస్థ (IFCI)
- Industrial Finance Corporation of India
- దీనిని 1948 జూలైలో ప్రారంభించారు. భారతదేశంలోని పరిశ్రమలకు మధ్య, దీర్ఘకాలీక ఋణాలివ్వడానికి ఏర్పాటు చేశారు.
- జాతీయ స్థాయిలో ఏర్పాటైన మొదటి అభివృద్ది బ్యాంక్.
0 Comments