
జాతీయాదాయం ముఖ్యమైన బిట్స్
Gk Questions in Telugu || Gk Questions and Answers || Gk questions in Telugu with Answers || Gk Questions in Telugu pdf || Gk Bits in Telugu
Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Bits Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, ప్రగతిని అంచనా వేయడానికి జాతీయాదాయం, ఉత్పత్తి, వ్యయాలు కొలమానంగా తీసుకుంటారు. జాతీయాదాయం, ఉత్పత్తి, వ్యయాలు అనేవి స్థూల ఆర్థిక శాస్త్రంలో ఇవి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. వీటిని శాస్త్రీయంగా గణించే విధానాలు, మదింపు పద్దతులపై పోటీపరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు అవగాహన కల్గి ఉండాలి. ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలు, వాటి ప్రాధాన్యం, వృద్ది రేటును నిర్ణయించే అంశాలు, ప్రణాళికల కాలంలో నమోదైన గణాంకాల వివరాలను బిట్స్ రూపంలో అందించడం జరుగుతుంది.
1. ఉత్పత్తి మదింపు పద్దతిలో దేనికి మినహాయింపు ఉంటుంది ?
జవాబు : గృహిణి సేవలు, పాత వస్తువుల అమ్మకం, షేర్లు, బాండ్ల వల్ల వచ్చే ఆదాయం
2. ఆదాయ మదింపు పద్దతిని ఎవరు ప్రవేశపెట్టారు ?
జవాబు : కీన్స్
3) వ్యయ మదింపు పద్దతిలో కుటుంబాలు చేసే వ్యయాన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు : వినియోగం
4) నికర ఎగుమతులు అంటే ఏమిటీ ?
జవాబు : ఎగుమతులు - దిగుమతులు
5) విదేశీ వ్యాపారం అనగా ఏమిటీ ?
జవాబు : ఎగుమతులు, దిగుమతులు
6) ద్వితీయ రంగం మరియు గనుల తవ్వకాన్ని ఏమంటారు ?
జవాబు : పారిశ్రామిక రంగం
7) హిందూ వృద్ది రేటు గురించి చెప్పినవారు ఎవరు ?
జవాబు : రాజ్‌కృష్ణ
8) ఏ ప్రణాళికలో భారతదేశం అధిక వృద్దిరేటును నమోదు చేసింది ?
జవాబు : 11వ ప్రణాళిక
9) ప్రస్తుతం జాతీయ ఆదాయంలో అతితక్కువ వాటా అందించే రంగం ?
జవాబు : వ్యవసాయం
10) ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అధిక వాటా అందించే రంగం ఏమిటీ ?
జవాబు : ప్రైవేటు రంగం
Also Read : Gk in Telugu
11) ప్రస్తుత జాతీయ ఆదాయంలో ఆధారం సంవత్సరం ఏమిటీ ?
జవాబు : 2011-12
12) చక్రీయ ఆదాయ ప్రవాహంలో కారకాల మార్కెట్ అంటే ఏమిటీ ?
జవాబు : గృహరంగం
13) చక్రీయ ఆదాయ ప్రవాహంలో చివరిగా ఆదాయాన్ని పొందేవారు ఎవరు ?
జవాబు : ఉత్పాదక రంగం
14) జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేసినవారు ?
జవాబు : వి.కె.ఆర్.వి రావు
15) ప్రభుత్వానికి ఆదాయం పన్నుల ద్వారా లభిస్తుంది. అయితే వాటిని ఏయే రంగాల ద్వారా చెల్లిస్తారు ?
జవాబు : గృహరంగాలు, వ్యాపార రంగాలు
16) పొదుపు పెట్టుబడిని అధిగమిస్తే ఆర్థిక వ్యవస్థ స్వరూపం ?
జవాబు : ఆదాయ ప్రవాహాం సిద్దం
17) నాలుగు రంగాల నమూనాలో ఇన్‌జెక్షన్‌గా పనిచేసే వరుస క్రమం ?
జవాబు : ఎగుమతులు + ప్రభుత్వ వ్యయం + పెట్టుబడి
18) ఒక దేశ పౌరులచే ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తువు ఏది ?
జవాబు : జాతీయ ఉత్పత్తి
19) జీడీపీ అంతరం అంటే ఏమీటీ ?
జవాబు : వాస్తవ ఉత్పత్తికి, వనరుల ఉత్పత్తికి మధ్య తేడా
20) గ్రీన్ జీడీపీ అంటే ఏమిటీ ?
జవాబు : పర్యావరణ నష్టాన్ని జీడీపీ ద్వారా సర్దుబాటు చేయడం
Also Read : Latest jobs in Telugu
21) నామమాత్రపు ఆదాయం వచ్చే విధానం ఏమిటీ ?
జవాబు : ప్రస్తుతం ఉత్పత్తి x ప్రస్తుత ధరలు
22) సెకండ్ హ్యాండ్ వస్తువులను జాతీయ ఆదాయంలో లెక్కించేటప్పుడు ఏ పద్దతి పాటిస్తారు ?
జవాబు : వాటిపై వచ్చే కమీషన్ తీసుకోవాలి
23) కేంద్ర గణాంక సంస్థ ఎప్పుడు ఏర్పడిరది ?
జవాబు : 1951
24) జాతీయాదాయం వృద్ది రేటు అధికంగా ఎప్పుడు నమోదైంది ?
జవాబు : 1966-67
25) జాతీయాదాయం వృద్ది రేటు అంటే ఏమీటీ ?
జవాబు : జాతీయ ఆదాయ వృద్ది రేటు - జనాభా వృద్ది రేటు
26) ఉత్పత్తి మదింపు పద్దతిని ఉత్పత్తి సేవా పద్దతి అని పేర్కొన్నవారు ?
జవాబు : కుజ్‌నెట్స్
27) ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం లెక్కించేటప్పుడు వాస్తవ ఆదాయంలోకి మార్చాలి అంటే ఏం చేయాలి ?
జవాబు : రెండుసార్లు లెక్కించాలి
28) ఉత్పత్తి మదింపు పద్దతిలో ఉండే రంగాలు ఏవి ?
జవాబు : ప్రాథమిక రంగం, తయారీ రంగం, నిర్మాణ రంగం
29) కేంద్ర గణాంక కార్యాలయం ప్రకారం 1954 లో దేశ తలసిరి ఆదాయం ఎంత ?
జవాబు : 225 రూపాయలు
30) ప్రస్తుతం దేశంలో 2022-23 సర్వే ప్రకారం తలసరి ఆదాయం ?
జవాబు : 1,70,620 రూపాయలు
31) నాలుగు రంగాల నమూనాలో ఆర్థిక వృద్దికి సమీకరణం ?
జవాబు : పొదుపు = పన్నులు = దిగుమతులు
0 Comments