
ఢిల్లీ సుల్తానులు జీకే ప్రశ్నలు - జవాబులు Part - 2
Delhi Sultanate Gk Questions with Answers in Telugu Part -2
☛ Question No.1
అల్లాఉద్దీన్ ఖిల్జీ యొక్క నిర్మాణాలు ఏవి ?
ఎ) సిరికోట
బి) అలయ్ దర్వాజా
సి) కుతుబ్‌మినార్ గేట్‌వే
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.2
అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆస్థానంలోని ఘాజామాలిక్ ఏ ప్రాంతానికి వైస్రాయ్ గా పనిచేశాడు ?
ఎ) దీపాల్‌పూర్
బి) బెంగాల్
సి) ఢిల్లీ
డి) తుగ్లకాబాద్
జవాబు : ఎ) దీపాల్‌పూర్
☛ Question No.3
1323లో వరంగల్‌పై దాడి చేసిన ఘియాజుద్దీన్ కుమారుడు ఎవరు ?
ఎ) ప్రిన్స్ జునాఖాన్
బి) మాలిక్ కపూర్
సి) నస్రత్ ఖాన్
డి) పైవారందరూ
జవాబు :ఎ) ప్రిన్స్ జునాఖాన్
☛ Question No.4
ఢిల్లీ సుల్తానులు వరంగల్‌ను ఆక్రమించిన తర్వాత పెట్టిన పేరు ఏమిటీ ?
ఎ) హనుమకొండ
బి) ఓరుగల్లు
సి) సుల్తాన్‌పూర్
డి) దౌలతాబాద్
జవాబు : సి) సుల్తాన్‌పూర్
☛ Question No.5
మహ్మద్ బీన్ తుగ్లక్ సంస్కరణల్లో ముఖ్యమైనవి ఏవి ?
1) రాయచూర్ - అంతర్వేది దోబ్ ప్రాంతాల్లో భూమి శిస్తు పెంచడం
2) రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చడం
3) రాగి నాణేలు ముద్రించడం
4) ప్రిన్స్ ఆఫ్ మనీయర్స్‌గా కీర్తి సాధించడం
ఎ) 1, 3 మరియు 4
బి) 1, 2 మరియు 4
సి) 1, 2, 3, 4
డి) 3 మరియు 4
జవాబు : సి) 1, 2, 3, 4
☛ Question No.6
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) మహ్మద్‌బీన్ తుగ్లక్ వ్యవసాయ దారులను ప్రోత్సహించడానికి దివాన్-ఇ-కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు.
2) 60వేల చదరపు మైళ్ల బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చారు
ఎ) 1 మాత్రమే
బి) 1 మరియు 2
సి) 2 మాత్రమే
డి) రెండూకావు
జవాబు : బి) 1 మరియు 2
☛ Question No.7
షరియత్ ప్రకారం రాజ్యపాలన చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
ఎ) ఘియాజుద్దీన్ తుగ్లక్
బి) మహ్మద్‌బీన్ తుగ్లక్
సి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
డి) ఫిరోజ్‌షా తుగ్లక్
జవాబు : డి) ఫిరోజ్‌షా తుగ్లక్
Also Read :
☛ Question No.8
ఈ క్రింది వాటిలో ఫిరోజ్‌షా తుగ్లక్‌కు సంబంధించిన సరైన దానిని గుర్తించండి ?
1) దార్-ఉల్-షిపా అనే వైద్యశాఖను నిర్మించారు
2) యాత్రికుల సౌకర్యార్థం 200 సరాయిలు నిర్మించారు
3) బానిసల కోసం అనేక ఏర్పాట్లు చేశారు
4) ఒరిస్సాపై దాడి చేసి జ్వాలాముకి ఆలయాన్ని దోచుకున్నాడు
ఎ) 1, 2 మరియు 3
బి) 1, 2 మరియు 4
సి) 1, 2, 3, 4
డి) 3 మరియు 4
జవాబు : సి) 1, 2, 3, 4
☛ Question No.9
ఢిల్లీ రాజ్యాన్ని చివరిగా పరిపాలించి లోడి వంశ రాజు ఎవరు ?
ఎ) బహులాల్
బి) సికిందర్
సి) ఇబ్రహీం లోడి
డి) ఫిరోజ్‌షా
జవాబు : సి) ఇబ్రహీం లోడి
☛ Question No.10
బాబరును భారతదేశంపై దాడి చేయాలని పిలుపునిచ్చింది ఎవరు ?
ఎ) పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్
బి) ఇబ్రహీం లోడి మామ అలంఖాన్
సి) ఇబ్రహీంలోడి
డి) ఎ మరియు బి
జవాబు : డి) ఎ మరియు బి
☛ Question No.11
ఢిల్లీ సుల్తానుల పతనానికి ముఖ్యమైన కారణాలు గుర్తించండి ?
1) సైన్యంలో క్రమశిక్షణ లేకపోవడం
2) తైమూర్ దండయాత్రలు
3) మహ్మద్ బీన్ తుగ్లక్ విధానాలు
4) అధిన పన్నుల భారం
ఎ) 1, 2 మరియు 3
బి) 1, 2 మరియు 4
సి) 1, 2, 3, 4
డి) 3 మరియు 4
జవాబు : సి) 1, 2, 3, 4
☛ Question No.12
ఢిల్లీ సుల్తానులు ప్రవేశపెట్టిన రాజ్యవిభాగాలను సరైన క్రమంలో గుర్తించండి ?
1) రాజ్యం
2) ఇక్తా
3) షిక్
4) పరగణ
5) గ్రామం
ఎ) 1, 2, 3, 4, 5
బి) 2, 4, 3, 1, 5
సి) 3, 4, 2, 1, 5
డి) 5, 3, 1, 2, 4
జవాబు : ఎ) 1, 2, 3, 4, 5
☛ Question No.13
ఢిల్లీ సుల్తానుల కాలంలో పరగణ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఎవరు ?
ఎ) అమీను
బి) మున్సిప్ , కమంగో
సి) కారూకన్, కోశాధికారి
డి) పై అందరూ
జవాబు : డి) పై అందరూ
☛ Question No.14
ఢిల్లీ సుల్తానుల కాలంలో వీరు పుష్కలంగా ఉండి, సారవంతమైన ప్రాంతాల్లో రైతులు ఏడాదికి మూడుపంటలు పండించారు అని అన్న చరిత్రకారుడు ఎవరు ?
ఎ) ఇసామీ
బి) ఇబన్ బటూటా
సి) అమీర్ ఖుస్రు
డి) అల్ బేరూనీ
జవాబు : బి) ఇబన్ బటూటా
☛ Question No.15
ఢిల్లీ సుల్తానుల కాలంనాటి ముఖ్య వ్యాపార కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలేవి ?
ఎ) సింధ్
బి) దేవగిరి, ఢిల్లీ
సి) ముల్తాన్, లాహోర్
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
0 Comments