చోళులు జీకే ప్రశ్నలు - జవాబులు Part - 3
Chola Dynasty GK Questions with Answers in Telugu | Indian History Questions in Telugu with Answers
☛ Question No.1
ఈ క్రిందవాటిలో సరికాని దానిని గుర్తించండి ?
ఎ) నవీన చోళ వంశస్థాపకుడు - విజయాలయుడు
బి) ఇతడి బిరుదు - రాజకేసరి
సి) నవీన చోళులకు విజయాలయ చోళులు అని పిలుస్తారు
డి) వీరి యొక్క రాజధాని మధురై
జవాబు : డి) వీరి యొక్క రాజధాని మధురై
☛ Question No.2
విజయాలయుడు నిర్మించిన ‘నిషంబ సూదిని’ దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది ?
ఎ) మధురై
బి) మధుర
సి) తంజావూరు
డి) కడలూరు
జవాబు : సి) తంజావూరు
☛ Question No.3
ఎవరి పరిపాలన కాలంలో తంజావూరు చోళుల రాజధానిగా మారింది ?
ఎ) మొదటి రాజరాజు
బి) పరాంతక చోళుడు
సి) ఆదిత్య చోళుడు
డి) విజయాలయుడు
జవాబు : సి) ఆదిత్య చోళుడు
☛ Question No.4
‘‘ఉత్తర మేరూర్ శాసనం’’ ఏ జిల్లాలో ఉంది ?
ఎ) కడలూరు
బి) ధర్మపురి
సి) కాంచీపురం
డి) చంగల్‌పట్టు
జవాబు : డి) చంగల్‌పట్టు
☛ Question No.5
మొదటి రాజరాజు అసలు పేరు ఏమిటీ ?
ఎ) రెండో పరాంతకుడు
బి) అరుమోలి వర్మన్
సి) పొన్నియన్ సెల్వన్
డి) ఆదిత్య చోళుడు
జవాబు : బి) అరుమోలి వర్మన్
☛ Question No.6
మొదటి రాజరాజు చివరగా ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు ?
ఎ) శ్రీలంక
బి) కేరళ
సి) మాల్దీవులు
డి) ఉత్తర భారత్
జవాబు : సి) మాల్దీవులు
☛ Question No.7
చూడామణి బౌద్ధ విహారానికి ‘అనైమంగళం’ అనే గ్రామాన్ని దానం చేసిన చోళరాజు ఎవరు ?
ఎ) పరాంతక చోళుడు
బి) సుందర చోళుడు
సి) మొదటి రాజరాజు
డి) రాజేంద్ర చోళుడు
జవాబు : సి) మొదటి రాజరాజు
Also Read :
☛ Question No.8
ఈ క్రిందివాటిలో మొదటి రాజేంద్ర చోళుడి బిరుదు కానిది ఏది ?
ఎ) మధురై కొండ
బి) పండిత చోళ
సి) కడారం చోళ
డి) గంగై కొండ
జవాబు : ఎ) మధురై కొండ
☛ Question No.9
బృహదీవ్వర ఆలయాన్ని ఏ సంవత్సరంలో పూర్తి చేశారు ?
ఎ) క్రీ.శ 1500
బి) క్రీ.శ 1230
సి) క్రీ.శ 1010
డి) క్రీ.శ 1000
జవాబు : సి) క్రీ.శ 1010
☛ Question No.10
మొదటి రాజేంద్రుడి కుమార్తెకు ఎవరితో వివాహం జరిగింది ?
ఎ) మిహిర భోజుడు
బి) కులోత్తుంగ చోళుడు
సి) రెండో పులకేశి
డి) రాజరాజ నరేంద్రుడు
జవాబు : డి) రాజరాజ నరేంద్రుడు
☛ Question No.11
ఈ క్రిందివాటిలో మొదటి రాజేంద్రుడి ఉత్తర భారత విజయాన్ని తెలియజేసేవి ఏవి ?
ఎ) గంగైకొండ చోళేశ్వర ఆలయ నిర్మాణం
బి) చోళ గంగమ్ అనే నీటిపారుదల చెరువు తవ్వించడం
సి) గంగైకొండ చోళపుర నిర్మాణం
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.12
ఈ క్రిందివారిలో చాళుక్య చోళ వంశస్థాపకుడు ఎవరు ?
ఎ) విజయాలయ చోళుడు
బి) కులోత్తుంగ చోళుడు
సి) రాజేంద్ర చోళుడు
డి) రెండో రాజరాజు
జవాబు : బి) కులోత్తుంగ చోళుడు
☛ Question No.13
ఈ క్రిందివారిలో చాళుక్య చోళ వంశస్థాపకుడు ఎవరు ?
ఎ) విజయాలయ చోళుడు
బి) కులోత్తుంగ చోళుడు
సి) రాజేంద్ర చోళుడు
డి) రెండో రాజరాజు
జవాబు : బి) కులోత్తుంగ చోళుడు
☛ Question No.14
చోళ సామ్రాజ్య విభాగాలను వరుస క్రమంలో అమర్చండి ?
ఎ) మండలం - వెలనాడు - నాడులు - గ్రామం
బి) వెలనాడు - మండలం - నాడులు - గ్రామం
సి) నాడులు - మండలం - వెలనాడు - మండలం
డి) గ్రామం - నాడులు - వెలనాడు - మండలం
జవాబు : ఎ) మండలం - వెలనాడు - నాడులు - గ్రామం
☛ Question No.15
చోళుల కాలంలోని ‘‘ఉదంకుట్టం’’ అంటే ఏమిటీ ?
ఎ) రాజకుమార్తె అంతరంగిక మందిరం
బి) రాజు అంతరంగిక మందిరం
సి) రాజు సొంత భూమి
డి) మంత్రిమండలి
జవాబు : డి) మంత్రిమండలి
- Chola Dynasty Gk Questions in Telugu Part - 1
- Chola Dynasty Gk Questions in Telugu Part - 2
- Chola Dynasty Gk Questions in Telugu Part - 4
0 Comments