Chola Dynasty GK Questions in Telugu with Answers | Indian History Questions in Telugu Part - 4

Chola Dynasty GK Questions in Telugu with Answers

చోళులు జీకే ప్రశ్నలు - జవాబులు Part - 4

Chola Dynasty GK Questions with Answers in Telugu | Indian History Questions in Telugu with Answers

మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

☛ Question No.1
మొదటి రాజేంద్రుడి చేతిలో ఓడిన పాలవంశ రాజు ఎవరు ?
ఎ) చంద్రదేవుడు
బి) మహీపాలుడు
సి) రెండో భీములు
డి) మిహిర భోజుడు

జవాబు : బి) మహీపాలుడు

☛ Question No.2
తంజావూర్‌ నిర్మాత ఎవరు ?
ఎ) రాజేంద్ర చోళుడు
బి) ఆదిత్య చోళుడు
సి) విజయాలయుడు
డి) సుందర చోళుడు

జవాబు : సి) విజయాలయుడు

☛ Question No.3
ఈ క్రిందివాటిని జతచేయండి ?
1) శివగనిందమని
2) పెరియ పురాణం
3) శ్రీభాష్యం
4) యాప్పురుంగళం
ఎ) రామానుజాచార్యులు
బి) అమిత సాగరుడు
సి) తిరుతక్కదేవర్‌
డి) శెక్కిలార్‌
ఎ) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ

జవాబు : బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి

☛ Question No.4
చోళుల కాలంలో ఏ సముద్రాన్ని చోళ సముద్రం అని పిలిచేవారు ?
ఎ) హిందూ మహాసముద్రం
బి) అరేబియా సముద్రం
సి) బంగాళాఖాతం
డి) ఎ, సి

జవాబు : సి) బంగాళాఖాతం

☛ Question No.5
ఏ శాసనం చోళుల గ్రామ పాలన గురించి తెలియజేస్తుంది ?
ఎ) తంజావూర్‌ శాసనం
బి) బహోలు శాసనం
సి) కన్యాకుమారి శాసనం
డి) ఉత్తర మేరూర్‌ శాసనం

జవాబు : డి) ఉత్తర మేరూర్‌ శాసనం

☛ Question No.6
కిందివాటిలో చోళుల పదజాలానికి సంబంధించి సరికాని జత ఏది ?
ఎ) ఓలియనాయగల్‌ - రాజజ్ఞలను అమలు చేసే కార్యదర్శి
బి) పెరుమాండ్రం - సచివాలయం
సి) సిరుంతరం - రాజుకు ఉన్న ప్రధానమంత్రి
డి) పెరుంతరంగ - ఉన్నత ఉద్యోగులు

జవాబు : సి) సిరుంతరం - రాజుకు ఉన్న ప్రధానమంత్రి



☛ Question No.7
ఈ క్రిందివాటిలో చోళుల కాలం నాటి గ్రామ సభ విధి ?
ఎ) శిస్తు వసూలు చేయడం
బి) నేరాలను విచారించి శిక్షించడం
సి) దేవాలయాల నిర్వహణ
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ


Also Read :


☛ Question No.8
ఈ క్రిందివాటిని జతచేయండి ?
1) బ్రహ్మదేయ
2) దేవదాన
3) శాలభోగ
4) తిరునామత్తుకని
ఎ) బ్రాహ్మణులకు దానం చేసిన భూములు
బి) దేవాలయాలకు దానంగా ఇచ్చిన భూములు
సి) విద్యాసంస్థలకు దానంగా ఇచ్చిన భూములు
డి) జైన సంస్థలకు దానంగా ఇచ్చిన భూములు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి

జవాబు : ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

☛ Question No.9
చోళుల కాలంలో అద్వైత విధానం వ్యాప్తిలో ఉంది అద్వైతం అంటే ఏమిటీ ?
ఎ) ఆత్మ, పరమాత్మ ఒక్కటే
బి) ఆత్మ వేరు, పరమాత్మ వేరు
సి) ఆత్మ సత్యం, పరమాత్మ లేదు
డి) ఆత్మ పరమాత్మలో భాగం

జవాబు : ఎ) ఆత్మ, పరమాత్మ ఒక్కటే

☛ Question No.10
చిదంబరంలోని నాగేశ్వరాలయం పై భాగంలో విమానానికి బంగారు కప్పును చేయించింది ?
ఎ) కులోత్తుంగ చోలుడు
బి) సుందర చోళుడు
సి) మొదటి పరాంతకుడు
డి) మొదటి రాజేంద్రుడు ‌

జవాబు : సి) మొదటి పరాంతకుడు

☛ Question No.11
చోళుల కాలంలో అతి తక్కువగా ఉపయోగించిన సైనిక దళం ఏది ?
ఎ) కాల్పళం
బి) అశ్వికదళం
సి) రథబలం
డి) నౌకాదళం

జవాబు : సి) రథబలం

☛ Question No.12
ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) న్యాయత్తార్‌ - న్యాయస్థానాలను సూచిస్తాయి
బి) కడగం - సైనికుల స్థావరం
సి) ఉర్‌ - బ్రహ్మదేయాలను పాలించే గ్రామసభ
డి) కుడుంబు - వార్డులను సూచిస్తాయి

జవాబు : సి) ఉర్‌ - బ్రహ్మదేయాలను పాలించే గ్రామసభ ‌

☛ Question No.13
ఈ క్రింది ఏ రాజవంశాన్ని సముద్రంతో ఆలలాడుతూ యుద్ధ విజయాలు సాధించిన వారిగా చెబుతారు ?
ఎ) చాళుక్యులు
బి) శాతవాహనులు
సి) చోళులు
డి) పల్లవులు

జవాబు : సి) చోళులు ‌

☛ Question No.14
చాళుక్య చోళ వంశంలో చివరివారు ఎవరు ?
ఎ) రెండో రాజరాజు
బి) రాజరాజ చోళుడు
సి) మూడో రాజేంద్రుడు
డి) మూడో కులోత్తుంగుడు

జవాబు : సి) మూడో రాజేంద్రుడు ‌

☛ Question No.15
పెరుంగూర్‌ అనే పదానికి అర్థం ఏమిటీ ?
ఎ) చోళుల కాలం నాటి న్యాయస్థానాలు
బి) చోళుల కాలంనాటి దేవాలయ నిర్వహణ కమిటీ
సి) చోళుల కాలంనాటి గ్రామసభలు
డి) చోళుల కాలంలో సైనిక స్థావరాలు

జవాబు : సి) చోళుల కాలంనాటి గ్రామసభలు ‌




Also Read :



Post a Comment

0 Comments