
క్విట్ ఇండియా ఉద్యమం Indian History in Telugu | Quit India Movement in Telugu
బ్రిటీష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రెండో ప్రపంచ యుద్దం కారణంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. భారత స్వాతంత్ర సమయంలో చివరి ఘట్టం అయిన క్విట్ ఇండియా ఉద్యమం 08 అగస్టు 1942న బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో ప్రారంభమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వార్ధాలో సమావేశం నిర్వహించి ఒక పోరాటానికి సిద్ధం కావాలిని పిలుపునిచ్చింది. ఇది మహాత్మ గాంధీ నాయకత్వంలో జరగాలని క్విట్ ఇండియా తీర్మాణాన్ని ఆమోదించారు. ఈ ఉద్యమం ద్వారా ‘‘ డూ ఆర్ డై (సాధించండి లేదా మరణించండి)’’ అనే నినాదాన్ని ఇచ్చారు.
రెండో ప్రపంచ యుద్ధకాలంలో అనేక ప్రాంతాల్లో బ్రిటిన్ జపాన్ చేతిలో ఓడిపోయి జపాన్ దురాక్రమణ నుండి భారతదేశాన్ని రక్షించలేని పరిస్థితిలో ఉంది. భారతీయులను సంప్రదించకుండా బ్రిటీష్‌వారి తరపున భారత్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని బ్రిటన్ ముందుగానే తెలియజేసి ఆ తర్వాత భారతీయుల మద్దతును పొందడానికి క్రిప్స్ రాయబారాన్ని పంపింది. కానీ గాంధీజి క్రిప్స్ రాయబారాన్ని అంగీకరించలేదు. దీంతో క్విట్ ఇండియా ఉద్యమం ముంబాయిలో ప్రారంభమైంది.
Also Read :
క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం కావడంతో బ్రిటీష్ ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. సెక్షన్ 144 విధించి ఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. వేల సంఖ్యంలో ప్రజలు మరణించారు. చాలా ప్రాంతాలను ప్రభుత్వ తమ ఆదీనంలోకి తీసుకుంది. జాతీయ కాంగ్రెస్ పై నిషేదాజ్ఞలు అమలు చేయడంతో పాటు ముఖ్య నాయకులందరిని రహస్య ప్రదేశాలకు ముందస్తుగానే తరలించారు. ఉద్యమం ప్రారంభం కాకముందే గాంధీజీ, కస్తూరిభా గాంధీ, మహదేవ్ దేశాయ్ మరియు సరోజిని నాయుడులను అరెస్టు చేసి పూణాలోని అగాఖాన్ ప్యాలెస్‌లో బంధించారు. దీంతో ఉద్యమానికి నాయకత్వం కరువ్వడంతో ప్రజలే ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నడిపించారు. హర్తాళ్లు, నిరసన ప్రదర్శనలు, నిరసన సమావేశాలు దేశమంతటా కొనసాగాయి. ప్రజలు అధిక సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బొంబాయి నుండి రహస్య రేడియో ప్రసారాలను చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని బాలియాలోను, బెంగాల్‌లోని మిడ్నపూర్ జిల్లాలో, మహారాష్ట్రలోని సతారాలోనూ ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. హింస వ్యాప్తి చెందింది. బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన హింసాకాండకు వ్యతిరేకంగా మరియు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నిర్భందంలో ఉన్న గాంధీజీ 12 ఫిబ్రవరి 1943న 21 రోజుల పాటు ఉపవాస దీక్షను ప్రారంభించాడు. 06 మే 1944న గాంధీజీ జైలు నుండి విడుదల కావడంతో ఈ ఉద్యమానికి తెరపడింది.
- క్విట్ ఇండియా ఉద్యమం జరిగే కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా విన్‌స్టన్ చర్చిల్ పనిచేశాడు.
- క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభ సమయంలో బ్రిటీష్ వైస్రాయి గా లార్డ్ లిన్‌లిత్‌గో ఉన్నాడు.
- క్విట్ ఇండియా ఉద్యమం ముగింపు సమయంలో బ్రిటిష్ వైస్రాయిగా లారడ్డ్ వేవెల్ పనిచేశాడు.
- ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముస్లీంలిగ్, హిందూ మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు వంటి పార్టీలు వ్యతిరేకించాయి.
- ఈ ఉద్యమానికి అరుణా అసఫ్ ఆలీ అనే మహిళ నాయకత్వం వహించారు.
- ఈ ఉద్యమ సమయంలో సి.పి.ఐ పార్టీ బ్రిటిష్ వారికి మద్దతు పలికింది.
0 Comments