
ప్రపంచ బ్యాంక్ (World Bank)
Gk ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ప్రపంచ దేశాల ఆర్థిక స్థితి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అభివృద్ది చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కుప్పకూలిపోయాయి. అటువంటి సందర్భంలో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడం అనివార్యమైంది. దీనికోసం 01 నుండి 22 జూలై 1944 వరకు న్యూహంప్‌షైర్‌లోని బ్రిటన్ వుడ్స్‌లో ప్రపంచంలోని 44 దేశాలకు చెందిన ప్రతినిధులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్నే "ఐక్యరాజ్య సమితి ద్రవ్య ఆర్థిక సమావేశం"గా పిలుస్తారు. ఈ సమావేశంలో అన్ని దేశాలు చర్చలు దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చడానికి ఐబీఆర్‌డీ, ఐఎమ్‌ఎఫ్ అనే రెండు అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు ఏకాభిప్రాయానికి వచ్చాయి. వీటిని బ్రిటన్ వుడ్స్ కవలలు అని పిలుస్తారు. అందులోని ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ) ని ‘ప్రపంచ బ్యాంక్’ గా పిలవడం జరుగుతుంది.
ప్రపంచ బ్యాంక్ సంస్థలు
ప్రపంచ బ్యాంక్ గ్రూపులో మొత్తం 5 సంస్థలున్నాయి.
- ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (IBRD)
- ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ (IDA)
- ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పోరేషన్ (IFC)
- మల్టీ లెటరల్ ఇన్వేస్ట్‌మెంట్ గ్యారంటీ ఏజెన్సీ (MIGA)
- ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్ (ICSID)
భారతదేశానికి ఐసీఎస్‌ఐడీ సంస్థలో తప్ప మిగతా అన్ని సంస్థల్లో సభ్యత్వం కల్గి ఉంది. ప్రపంచ బ్యాంక్‌లో సభ్యత్వం లభించాలంటే మొదటి ఐఎమ్‌ఎఫ్‌లో సభ్యత్వం కల్గి ఉండాలి. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంది. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుతం చైర్మన్‌గా డేవిడ్ మాల్‌పాస్ (జపాన్) వ్యవహరిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ దేశాల యొక్క ఆర్థిక పునర్నిర్మాణం మరియు అభివృద్దికి దీర్ఘకాలిక ఋణాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఐబీఆర్‌డీలో రెండు రకాల సభ్య దేశాలుంటాయి.
1) 31 డిసెంబర్ 1945 నాటికి ఉన్న స్థాపక సభ్యదేశాలు (ఇందులో భారత్ ఉంది)
2) సాధారణ సభ్య దేశాలు
విధులు
- మధ్య ఆదాయ, పరపతి సామర్థ్యం ఉన్న అల్ప, ఆదాయ దేశాలకు రుణాలను అందజేస్తుంది.
- దీర్ఘకాలిక రుణాలను తక్కువ వడ్డీకి అందజేస్తుంది.
- ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక సహాయం అందిస్తుంది.
అంతర్జాతీయ అభివృద్ది సంస్థ (ఐడీఏ) :
ఈ సంస్థను 1960 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇందులో భారత్ సభ్య దేశంగా ఉంది. ఈ సంస్థను ప్రపంచ బ్యాంక్‌కు సాప్ట్ విండో / సాప్ట్ లెండిరగ్ ఆర్మ్ గా పిలుస్తారు. ప్రపంచంలోని వెనుకబడిన, పేద దేశాలకు వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. వీటిని ఆయా దేశాలు 30 నుండి 40 సంవత్సరాలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా దేశాల కరెన్సీలలో చెల్లించే సౌలభ్యం ఉంటుంది. 2023 నాటికి దేశాల తలసరి ఆదాయం 1255 డాలర్ల కంటే తక్కువ ఉంటుందో ఆ దేశాలకు రుణాలు పొందడానికి అర్హత ఉంటుంది.
అంతర్జాతీయ విత్త కార్పోరేషన్ (ఐఎఫ్‌సీ) :
ఈ సంస్థను 20 జూలై 1956 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని అభివృద్ది చెందిన దేశాలలో నిర్వహిస్తున్న ప్రైవేటు పరిశ్రమలకు రుణ సదుపాయం కల్పిస్తుంది. అంతర్జాతీయ విత్త మార్కెట్‌లో బాండ్లు జారీ చేయడం ద్వారా ఎఫ్‌సీ నిధులు సమకూర్చుకుంటుంది.
మల్టీ లెటరల్ ఇన్వేస్ట్‌మెంట్ గ్యారంటీ ఏజెన్సీ (ఎంఐజీఏ) :
ఈ సంస్థను 1988 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. కరెన్సీ బదిలీలు, యుద్దం, పౌర అశాంతి తదితర సందర్భాలలో విదేశీ పెట్టుబడిదారులకు భీమా సౌకర్యం కల్పిస్తుంది.
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్ (ఐసీఎస్‌ఐడీ) :
ఈ సంస్థను 1966 అక్టోబర్ 14న ఏర్పాటు చేశారు. విదేశీ పెట్టుబడిదారులు, వారికి ఆతిథ్యం ఇచ్చే అభివృద్ది చెందుతున్న దేశాల మధ్య ఏర్పడే పెట్టుబడి వివాదాలను పరిష్కరిస్తుంది.
ప్రపంచ బ్యాంక్ (World Bank Gk Questions and Answers)
1. ప్రపంచ బ్యాంక్ గ్రూపులో ఎన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి ?
జవాబు : 05
2) బ్రిటన్ ఉడ్స్ కవలలు అని వేటిని అంటారు ?
జవాబు : ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ) మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)
3) ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ) ఎప్పుడు ఏర్పడినది ?
జవాబు : 1945
4) ప్రపంచ బ్యాంక్ ఏ సంస్థ నుండి ఏర్పడినది ?
జవాబు :ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ)
5) ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జవాబు : వాషింగ్టన్ (అమెరికా)
6) ప్రస్తుత (2023) ప్రపంచ బ్యాంక్ చైర్మన్ ఎవరు ?
జవాబు : డేవిడ్ మాల్‌పాస్
7) ప్రస్తుతం (2023) ప్రపంచ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేస్తున్న డేవిడ్ మాల్‌పాస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి ?
జవాబు : జపాన్
10) అంతర్జాతీయ అభివృద్ది సంస్థ (ఐడీఏ) ఎప్పుడు ఏర్పడినది ?
జవాబు : 1960
ది
Related Posts
0 Comments