
ఆధునిక భారతదేశ చరిత్ర (గిరిజనులు తిరుగుబాట్లు) జీకే ప్రశ్నలు - జవాబులు
Modern India History in Telugu Part - 3
☛ Question No.1
రైతులు గిరిజనులు తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం ?
ఎ) రాజకీయ కారణాలు
బి) ఆర్థిక కారణాలు
సి) గిరిజనుల అసంతృప్తి
డి) పైవన్నీ
జవాబు :డి) పైవన్నీ
☛ Question No.2
ఈ క్రిందివాటిని జతపర్చండి ?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) ఒడిశా
4) బిహార్
ఎ) కోలి
బి) నాయక్
సి) ఖోండ్
డి) సంతాలీలు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
జవాబు : ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
☛ Question No.3
బ్రిటిష్ వారు చేసిన అటవీ చట్టాలకు సంబంధించి సరికానిది గుర్తించండి ?
ఎ) గిరిజనుల స్వేచ్ఛకు భంగం కల్గించాయి
బి) గిరిజనుల ఆదాయం పెంచాయి
సి) సంప్రదాయ పరిపాలన వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి
డి) గిరిజనుల అడవులపై హక్కులను కోల్పొయేలా చేశాయి.
జవాబు : బి) గిరిజనుల ఆదాయం పెంచాయి
☛ Question No.4
బిహార్‌లోని సంతాలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ?
ఎ) 1856-58
బి) 1855-56
సి) 1855-57
డి) 1857-59
జవాబు : బి) 1855-56
☛ Question No.5
తమల్ గిరిజన తెగ ఏ ప్రాంతంలో నివసించారు ?
ఎ) ఛోటానాగపూర్
బి) బెంగాల్
సి) దక్కన్ ఫీఠభూమి
డి) మాల్వా పీఠభూమి
జవాబు : ఎ) ఛోటానాగపూర్
☛ Question No.6
1857 తిరుగుబాటు సమయంలో పలమౌ, రాంచీ, హజారీ బాగ్ వద్ద ఉన్న చిరో తెగ గిరిజనులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు ?
ఎ) పితాంబర్
బి) బిర్సా
సి) రామ్‌నాయక్
డి) కొమురం భీం
జవాబు : ఎ) పితాంబర్
☛ Question No.7
‘బిల్’ గిరిజన తిరుగుబాటుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది ?
1) ఇది 1817-19 మధ్య జరిగింది
2) ఈ తిరుగుబాటు మార్కోస్ హెస్టింగ్స్ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది.
3) పశ్చిమ కనుమల్లోని ఖాందేశ్ ప్రాంతంలో ఉంటారు
4) వీరికి సహాయం చేసినవారు ఫీష్వా రెండో బాజీరావు
ఎ) 1, 2, 3, 4
బి) 1 మరియు 3
సి) 1, 2, 3
డి) 1, 2, 4
జవాబు : ఎ) 1, 2, 3, 4
Also Read :
☛ Question No.8
రామోసే తెగవారు ప్రధానంగా దాడులు చేసిన ప్రాంతం ఏది ?
ఎ) సతారా
బి) నాసిక్
సి) పుణే
డి) కాన్పూర్
జవాబు : ఎ) సతారా
☛ Question No.9
కోల్ తిరుగుబాటు ఏ ప్రాంతం కేంద్రంగా కొనసాగింది ?
ఎ) రాంచీ
బి) నాగ్‌పూర్
సి) సతారా
డి) లఖ్‌నవూ
జవాబు : ఎ) రాంచీ
☛ Question No.10
ఈ క్రింది వాటిలో భిన్నమైంది గుర్తించండి ?
ఎ) ఖోండ్
బి) బైగా
సి) బెవార్
డి) గద్దీలు
జవాబు : సి) బెవార్
☛ Question No.11
1845లో బ్రిటిష్‌వారు స్థాపించిన ‘మెరియా ఏజెన్సీ’ ప్రధాన ఉద్దేశ్యం ?
ఎ) ఖోండ్ సమాజంలో వేటను నిషేదించడం
బి) ఖోండ్ వారు అటవీ వస్తువుల సేకరణ చేయవద్దని చెప్పడం
సి) నరబలులు, ఆడ శిశువుల హత్యలను అరికట్టడం
డి) అడవుల్లో చెట్లు నరకవద్దని చెప్పడం
జవాబు : సి) నరబలులు, ఆడ శిశువుల హత్యలను అరికట్టడం
☛ Question No.12
సంతాల్ తిరుగుబాటు ఏ గవర్నర్ జనరల్ చివరి కాలంలో జరిగింది ?
ఎ) కానింగ్
బి) కారన్‌వాలిస్
సి) లార్డ్ డల్హౌసీ
డి) రాబర్ట్ క్లైవ్
జవాబు : సి) లార్డ్ డల్హౌసీ
☛ Question No.13
సంతాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించవారు ఎవరు ?
ఎ) సిధు
బి) కన్హూ
సి) ఎ మరియు బి
డి) బిర్సా
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.14
కోల్ తిరుగుబాటుకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్‌లో జరిగింది
2) ఈ తిరుగుబాటు నాయకుడు బుద్దో భగత్
ఎ) ఎ మాత్రమే
బి) బి మాత్రమే
సి) 1 మరియు 2
డి) ఏదీకాదు
జవాబు : బి) బి మాత్రమే
☛ Question No.15
అహోమ్ తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం ఏమిటీ ?
ఎ) ఖాసీ తెగ గిరిజనులపై బ్రిటీష్ వారి అరాచకాలు
బి) అహోమ్ తెగ గిరిజనుల పట్ల బ్రిటిష్ వారి అరాచకాలు
సి) అస్సాంను బ్రిటిష్ సామ్రాజ్య సరిహద్దులకు అనుసంధానించడం
డి) అస్సాంలో బ్రిటీష్ వారు అవలంభించిన వ్యవసాయ విధానాలు
జవాబు : డి) అస్సాంలో బ్రిటీష్ వారు అవలంభించిన వ్యవసాయ విధానాలు
0 Comments