
ఆధునిక భారతదేశ చరిత్ర (గిరిజనులు, తిరుగుబాట్లు) జీకే ప్రశ్నలు - జవాబులు
Modern India History in Telugu Part - 4
☛ Question No.1
విశాఖపట్టణంలో గిరిజన తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది ?
ఎ) 1935
బి) 1925
సి) 1832
డి) 1831
జవాబు : సి) 1832
☛ Question No.2
విశాఖపట్టణం గిరిజన తిరుగుబాటును పరిగణించి సరైనవి గుర్తించండి
1) ఈ తిరుగుబాటు కాశీపురం, పాయకరావుపేట, పాలకొండ, జమీందారీలలో జరిగింది.
2) తిరుగుబాటు అణచివేయడానికి నియమితుడైన అధికారి జార్జీ రుస్సెల్
3) 1939 లో ప్రభుత్వం XXIV చట్టం వేసింది
4) గిరిజనులు పితూరీల రూపంలో తిరుగుబాట్లు చేశారు.
ఎ) 1, 2, 3
బి) 1, 2, 4
సి) 1 మరియు 2
డి) 1, 2, 3, 4
జవాబు : డి) 1, 2, 3, 4
☛ Question No.3
బ్రిటిష్ వారు చేసిన అటవీ చట్టాలకు సంబంధించి సరికానిది గుర్తించండి ?
ఎ) గిరిజనుల స్వేచ్ఛకు భంగం కల్గించాయి
బి) గిరిజనుల ఆదాయం పెంచాయి
సి) సంప్రదాయ పరిపాలన వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి
డి) గిరిజనుల అడవులపై హక్కులను కోల్పొయేలా చేశాయి.
జవాబు : బి) గిరిజనుల ఆదాయం పెంచాయి
☛ Question No.4
బిహార్‌లోని సంతాలీల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది ?
ఎ) 1856-58
బి) 1855-56
సి) 1855-57
డి) 1857-59
జవాబు : బి) 1855 -56
☛ Question No.5
తమల్ గిరిజన తెగ ఏ ప్రాంతంలో నివసించారు ?
ఎ) ఛోటానాగపూర్
బి) బెంగాల్
సి) దక్కన్ ఫీఠభూమి
డి) మాల్వా పీఠభూమి
జవాబు : ఎ) ఛోటానాగపూర్
☛ Question No.6
1857 తిరుగుబాటు సమయంలో పలమౌ, రాంచీ, హజారీ బాగ్ వద్ద ఉన్న చిరో తెగ గిరిజనులు ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేశారు ?
ఎ) పితాంబర్
బి) బిర్సా
సి) రామ్‌నాయక్
డి) కొమురం భీం
జవాబు :ఎ) పితాంబర్
☛ Question No.7
‘‘గోండు’’ ఉద్యమానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) దీని నాయకుడు కొమురం భీం
2) దీని నినాదం జల్, జంగిల్, జమీన్
3) ఈ తిరుగుబాటు తంత్రం గెరిల్లా పోరాటం
ఎ) 1, 2, 3
బి) 1 మరియు 3
సి) 3 మాత్రమే
డి) 2 మాత్రమే
జవాబు : ఎ) 1, 2, 3
☛ Question No.8
ఖాసీ జయంతియా కొండల్లో బ్రిటీష్ వారు వేసే రోడ్లకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు పేరు ఏమిటీ ?
ఎ) అహోమ్
బి) సంతాలి
సి) ఖాసీ
డి) నాయక్
జవాబు : సి) ఖాసీ
Also Read :
☛ Question No.9
కుకీ తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఏది ?
ఎ) అస్సాం
బి) మణిపూర్
సి) మిజోరాం
డి) నాగాలాండ్
జవాబు : బి) మణిపూర్
☛ Question No.10
రంప ఏజేన్సీ అధిపతి మన్సబ్‌దారుకు సహాయం చేసినవారు ఎవరు ?
ఎ) సుబేదార్లు
బి) ముత్తాదార్లు
సి) జమీందార్లు
డి) జాగీర్దార్లు
జవాబు : బి) ముత్తాదార్లు
☛ Question No.11
1835లో మరణించిన రంప మన్సబ్ దారు ఎవరు ?
ఎ) రామ భూపతిదేవ్
బి) మాధవతి
సి) అంబుల్‌రెడ్డి
డి) సాంబయ్య
జవాబు :ఎ) రామ భూపతిదేవ్
☛ Question No.12
రంప తిరుగుబాటు అణిచివేసేందుకు వచ్చిన రెవెన్యూ బోర్డు సభ్యుడు ఎవరు ?
ఎ) రాబర్ట్ క్లైవ్
బి) సల్లెవన్
సి) సర్‌జాన్ షోర్
డి) హంటర్
జవాబు :బి) సల్లెవన్
☛ Question No.13
గిరిజనులు మాహువా చెట్ల పూలను దేనికి ఉపయోగిస్తారు ?
ఎ) తినడానికి
బి) మద్యం తయారికి
సి) ఎ మరియు బి
డి) అలంకరణకు
జవాబు : సి) ఎ మరియు బి
☛ Question No.14
ఈ కిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) ఒడిశాలోని ఖోండ్‌లు సామూహిక వేటకు వెళతారు
2) మధ్యప్రదేశ్‌లోని బైగాలు ఉత్తమ వేటగాళ్లు
ఎ) ఎ మాత్రమే
బి) బి మాత్రమే
సి) 1 మరియు 2
డి) ఏదీకాదు
జవాబు : సి) 1 మరియు 2
☛ Question No.15
గిరిజన పంట కాలాలను జతపరచండి ?
1) జేత్
2) కార్తిక్
3) కౌర్
4) మూగ్
ఎ) కుత్కి పక్వానికి వస్తుంది
బి) కొత్త బెవార్‌లకు వెళ్లేవారు
సి) విత్తడం ప్రారంభిస్తారు
డి) బీన్ పక్వానికి వస్తుంది
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఎ
బి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
జవాబు : డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
☛ Question No.16
1900లో జరిగిన బిర్సాముండాకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
ఎ) వడ్డీ, వ్యాపారులు, హిందూ భూస్వాముల్నీ వ్యతిరేకించారు
బి) బిర్సా అధిపతిగా ముండా రాజ్యం ఏర్పడాలన్నారు
సి) బిర్సాను 1897లో అరెస్టు చేశారు
డి) బిర్సా కలరా వ్యాదితో మరణించాడు
జవాబు : సి) బిర్సాను 1897లో అరెస్టు చేశారు
☛ Question No.17
నైషి తెగ గిరిజనులు ఉన్న ప్రాంతం ఏది ?
ఎ) అస్సాం
బి) అరుణాచల్ ప్రదేశ్
సి) ఒడిశా
డి) ఆంధ్రప్రదేశ్
జవాబు : బి) అరుణాచల్ ప్రదేశ్
0 Comments