
ప్రపంచంలోని ముఖ్యమైన సరిహద్దు రేఖలు
Important Boundary Lines of India, World || Gk in Telugu || General Knowledge in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk in Telugu, Bank (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
అంతర్జాతీయ సరిహద్దులు అనేవి రెండు సార్వభౌమ దేశాలను వేరేచేసే సరిహద్దులు. వాటి యొక్క భూభాగాలు మరియు చట్టపరమైన అధికార పరిధిని సూచిస్తాయి. ఈ సరిహద్దులను సృష్టించే విధానాన్ని సరిహద్దు డిలిమిటేషన్ అంటారు. కొన్ని దేశాల మద్య సరిహద్దులు నామమాత్రంగా ఉన్నప్పటికి మరికొన్ని దేశాల మద్య సరిహద్దులు నిరంతరం కాపాలాకాస్తు ఉద్రిక్తంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మద్య సరిహద్దు రేఖలు ఉన్నాయి. వివిధ దేశాల మధ్య భూమికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడంలో ఈ సరిహద్దు రేఖలు కీలక పాత్ర పోషిస్తాయి. డ్యూరాండ్, హిండెన్ బర్గ్, సీజ్‌ప్రైడ్, 49వ సమాంతర రేఖ, రాడ్‌క్లిప్ వంటి అనేక సరిహద్దు రేఖలున్నాయి.
భారతదేశంలో తన అంతర్జాతీయ సరిహద్దులను ఏడు దేశాలతో పంచుకుంటుంది. రాడ్‌క్లిప్ రేఖ మరియు మెక్‌మోహన్‌రేఖ రెండు అత్యంత ముఖ్యమైన సరిహద్దు రేఖలు. ఈ సరిహద్దు రేఖలు నిర్ధిష్ట కారణాల కోసం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.
Also Read : Gk Questions in Telugu
➺ హిండెన్ బర్గ్ రేఖ :
హిండెన్ బర్గ్ రేఖ జర్మనీ మరియు పోలెండ్ దేశాల మద్య ఏర్పాటు చేసిన సరిహద్దు రేఖ పేరు. దీనిని 1917 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ద సమయంలో జర్మన్ సైన్యం జర్మనీ మరియు పోలెండ్ రెండు దేశాల మద్య ఏర్పాటు చేశారు.
➺ ఓడర్-నిస్సీ రేఖ :
ఓడర్-నిస్సీ అనే రేఖను ఓడర్, నిస్సీ అనే రెండు నదుల వెంబడి జర్మనీ, పోలెండ్ దేశాలను విడదీసేందుకు ఏర్పాటు చేసిన సరిహాద్దు రేఖ. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో 1945 దీనిని ఏర్పాటు చేశారు.
➺ సీజ్‌ఫ్రైడ్ రేఖ :
సీజ్‌ఫ్రైడ్ రేఖను జర్మనీ దేశం ప్రాన్స్ దేశంతో సరిహాద్దు ఏర్పాటు చేయడానికి నిర్మించిన రేఖ. దీనిని ఫోర్టిఫైడ్ లైన్ అని కూడా అంటారు.
➺ మోగినాట్ రేఖ :
రెండవ ప్రపంచానికి యుద్దం ముందు జర్మనీ దేశం దాడుల నుండి రక్షించుకోవడానికి ప్రాన్స్ దేశం తన సరిహద్దు వెంబడి నిర్మించుకున్న సరిహద్దు రేఖ. మోగినాట్ రేఖను 320 కిలోమీటర్ల పొడవుతో ఉన్న సరిహద్దు నిర్మాణం.
➺ మెక్‌మోహన్ రేఖ :
మెక్‌మోహన్ రేఖను భారత్ మరియు చైనా దేశాల సరిహద్దులను సూచిస్తూ సర్ హెన్రీ మెక్‌మోహన్ అనే వ్యక్తి గీసిన సరిహద్దు రేఖ. ఈ రేఖను భారత్ గుర్తించింది కానీ చైనా గుర్తించలేదు. 1962 సంవత్సరంలో చైనా ఈ మెక్‌మోహన్ రేఖ సరిహద్దును ఉల్లంఘించింది.
➺ రాడ్‌క్లిప్ రేఖ :
రాడ్‌క్లిప్ రేఖ భారత్ మరియు పాకిస్తాన్ దేశాల సరిహద్దును నిర్ణయిస్తూ సర్ సిరిల్ రాడ్‌క్లిప్ అనే వ్యక్తి నిర్ణయించిన రేఖ.
Also Read : Latest Jobs in Telugu
➺ డ్యూరాండ్ రేఖ :
డ్యూరాండ్ రేఖను పాకిస్తాన్ మరియు ఆప్ఘనిస్తాల మద్య ఏర్పాటు చేసిన సరిహద్దు రేఖ. ఈ డ్యూరాండ్ సరిహద్దు రేఖను 1893 లో సర్ మోర్టిమర్ డ్యూరాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రేఖను ఆప్ఘనిస్తాన్ గుర్తించలేదు.
➺ 16వ సమాంతర లైన్ :
దీనిని నమీబియా మరియు అంగోలా దేశాల మద్య నిర్మించిన సరిహద్దు రేఖ.
➺ 17వ సమాంతర లైన్ :
దీనిని ఉత్తర వియాత్నం, దక్షిణ వియత్నాంల మధ్య నిర్మించిన సరిహద్దు రేఖ.
➺ 24వ సమాంతర లైన్ :
భారతదేశంతో తమ సరిహద్దును గుర్తిస్తూ పాకిస్తాన్ ప్రకటించుకున్న సరిహద్దు రేఖ. ఈ రేఖను భారత్ గుర్తించలేదు.
➺ 38వ సమాంతర రేఖ :
దీనిని ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా దేశాల మద్య విభజించుకున్న సరిహద్దు రేఖ.
➺ 49వ సమాంతర రేఖ :
దీనిని అమెరికా, కెనడాల మధ్య నిర్మించుకున్న సరిహద్దు రేఖ.
➺ మానర్హియమ్ రేఖ :
దీనిని రష్యా మరియు ఫిన్లాండ్ దేశాల మద్య నిర్మించుకున్న రక్షణ నిర్మాణ రేఖ. ఈ రేఖను జనరల్ మానర్హియమ్ అనే వ్యక్తి రూపొందించాడు.
జవాబు : సర్ మోర్టిమర్ డ్యూరాండ్
జవాబు : 1917
జవాబు :రాడ్‌క్లిప్ రేఖ
జవాబు : ఇండియా - పాకిస్తాన్
జవాబు : ఇది అమెరికా మరియు కెనడా మధ్య గీసిన సరిహద్దు రేఖ
0 Comments