
నేలలు / మృత్తికలు Classification of Soils of India in Telugu || Gk in Telugu || General Knowledge in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk in Telugu (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
మానవులు మనుగడ సాగించే భూమి యొక్క ఉపరితలంపై కప్పి ఉంచబడిన సన్నని మట్టి పొరను ‘‘ నేలలు ’’ లేదా " మృత్తికలు" అని పిలుస్తారు. ఈ నేలలు / మృత్తికలు సేంద్రీయ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వల్ల ఉద్భవిస్తాయి. ఈ మృత్తికలు రూపాంతరం చెందాలంటే కొన్ని వందల సంవత్సరాలు సమయం పడుతుంది. మృత్తికల యొక్క లక్షణాలు, వాటియొక్క రూపాంతరం, అందులోని రకాల గురించి తెలుసుకుందాం ..
భారతభూభాగం అనేక రకాల నేలలతో కప్పబడి ఉంది. ఇవి ప్రాంతాలను బట్టి వివిధ రకాలుగా వ విస్తరించి ఉన్నాయి. నేలలను వాటి యొక్క లక్షణాలను బట్టి వివిధ రకాలుగా విభజించడం జరిగింది. అవి.
- ఒండ్రు మృత్తికలు
- నల్లరేగడి మృత్తికలు
- ఎర్ర మృత్తికలు
- లేటరైట్ మృత్తికలు
- ఎడారి / ఇసుక మృత్తికలు
- ఆమ్ల / క్షార మృత్తికలు
- పీటి / సేంద్రీయ మృత్తికలు
- పర్వత ప్రాంత మృత్తికలు
1) ఒండ్రు మృత్తికలు :
ఈ రకం మృత్తికలు మెత్తటి రేణుయుత అవక్షేపాలను నిక్షేపించడం వల్ల ఏర్పడుతాయి. దేశభూభాగంలో ఇవి దాదాపు 43.36 శాతం విస్తరించి ఉన్నాయి. ఇందులో సున్నపురాయి, పొటాషియం, పాస్పారిక్ ఆమ్లం అధికంగా ఉంటాయి. నత్రజని, హూమస్ తక్కువగా ఉంటాయి. ఇవి దేశంలోని గంగా, సిందూ, బ్రహ్మపుత్ర మైదానాల్లో, తూర్పుతీర డెల్డా ప్రాంతాలు, తీర మైదానాల్లో అధికంగా ఉంటాయి. వీటిని భారత ధాన్యాగారాలు అని పిలుస్తారు.
2) నల్లరేగడి మృత్తికలు :
ఇవి దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్ శిలలపై ఏర్పడతాయి. దక్కన్ నాపరాళ్ల శైథిల్యం వల్ల నల్లరేగడి మృత్తికలు ఏర్పడతాయి. ఇవి భారతదేశంలోని మహారాష్ట్రలో అత్యధికంగా కనిపిస్తాయి. ఇది దేశ మొత్తం భూభాగంలో 15 శాతం విస్తరించి ఉన్నాయి. ఇందులో ఇనుప పదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల ఇవి మనకు నల్లగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువ శాతం బంకమన్నుతో తేమను అధికంగా నిల్వ చేసుకునే గుణం ఉంటుంది. వేసవి సమయంలో ఈ రకం మృత్తికల్లో లోతైన నెర్రలు ఏర్పడతాయి. ఈ లోపలి పొరల్లోకి వాయిప్రసరణ జరిగి, వాతావరంలోని నత్రజనిని స్వీకరించడానికి వీలువుతుంది. వర్షం పడినప్పుడు పైన ఉన్న మట్టి పొరలోకి చేరుతుంది. ఇలా స్వయంగా మట్టిమార్పిడి చేసుకోవడం వల్ల వీటిని తమను తాము దున్నుకునే నేలు అని పిలుస్తారు. ఈ రకం మృత్తికల్లో ఇనము, మెగ్నిషియం, అల్యూమినియం, లైమ్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఫాస్పరస్, సేంద్రీయ పదార్థాలు నత్రజనీ లోపించి ఉంటాయి. ఇవి పత్తి పంటకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. వీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ‘‘రేగర్ / రేగడి ’’ భూములు అని పిలుస్తారు. ఈ భూములను అంతర్జాతీయంగా ‘‘ట్రాఫికల్ చెర్నోజోమ్స్ ’’ అని పిలుస్తారు.
3) ఎర్ర మృత్తికలు :
ఇవి తక్కువ వర్షపాతం ఉండే ప్రదేశాల్లో స్పటికాకార రూపాంతర శిలలు శైథిల్యం చెందిన ఎర్రమృత్తికలు ఏర్పడతాయి. ఈ రకం మృత్తికలు తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పసుపు వర్ణంలోకి మారే గుణం ఉంటుంది. ద్వీపకల్ప ఫీఠభూమికి తూర్పు, దక్షిణ భాగాల్లో ఈ మృత్తికలు ఉన్నాయి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, అరావళి పర్వతాలు, భాగేల్‌ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఎర్ర మృత్తికలు ఉన్నాయి. ఇవి దేశ భూ విస్తీర్ణంలో 18.50 ఆక్రమించి ఉన్నాయి. ఈ మృత్తికల్లో నైట్రోజన్, హూమస్ లోపించి ఉంటాయి. ఈ రకంలో మృత్తికల్లో వ్యవసాయం చేసేటప్పుడు ఎరువులు వాడితే అధిక దిగుబడి చేయవచ్చు.
4) లేటరైట్ మృత్తికలు :
ఈ రకం మృత్తికలు ఎర్ర రంగులో ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఏర్పడతాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, అరావళి పర్వతాలు, ఒడిశా, అసోం, మేఘాలయా వంటి ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇవి దేశ భూభాగంలో 3.75 శాతం విస్తరించి ఉన్నాయి.
5) ఎడారి / ఇసుక మృత్తికలు :
ఈ రకం మృత్తికలు శుష్క శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతాల్లో యాంత్రిక శిలాశైథిల్యం వల్ల ఏర్పడతాయి. ఇవి గాలిదిశను బట్టి విస్తరిస్తూ ఉంటాయి. దేశంలో గుజరాత్, హర్యానా, వాయవ్య ప్రాంతంలో ఉన్నాయి. ఇవి దేశ భూభాగంలో 4.42 శాతం ఆక్రమించి ఉన్నాయి. ఈ రకం మృత్తికల్లో సజ్జ, జొన్న, పప్పుధాన్యాలు ఎక్కువగా పండుతాయి.
6) ఆమ్ల / క్షార మృత్తికలు :
అధిక లవణాల గాడత వల్ల ఏర్పడే వాటిని ఆమ్ల / క్షార మృత్తికలు అని పిలుస్తారు. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ రకం మృత్తికలు వ్యవసాయినికి ఏ విధంగా కూడా పనికి రావు. వీటిని రే / కల్లార్ / ఊసర మృత్తికలు అని కూడా పిలుస్తారు. ఇవి భారతదేశంలో గంగామైదాన వాయవ్య ప్రాంతం, గుజారాత్ కచ్ ప్రాంతంలో అధికంగా విస్తరించి ఉన్నాయి.
7) పీటి / సేంద్రీయ మృత్తికలు :
వీటిని ఊబి నేలలు అని కూడా పిలుస్తారు. జీవసంబంధ పదార్థం ఎక్కువగా సంచమయం చెందడం వల్ల ఈ రం నేలలు ఏర్పడతాయి. వీటిలో తేమ, బురద ఎక్కువగా ఉండడం వల్ల వరిసాగుకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఇవి భారతదేశంలో బీహార్ ఉత్తరం ప్రాంతం, పశ్చిమబంగా, ఉత్తరాఖండ్‌లోని అల్మోర జిల్లా, తమిళనాడు తీర ప్రాంతం, కేరళలలో అధికంగా విస్తరించి ఉన్నాయి.
8) పర్వత ప్రాంత మృత్తికలు :
ఇవి అత్యధిక వర్షపాతం ఉండే పర్వత ప్రాంత వాలుల్లో ఏర్పడతాయి. ఈ రకం మృత్తికల్లో హూమస్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి రవాణా అవుతూ ఉంటాయి. తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటిని ఈ నేలలు అనుకూలంగా ఉంటాయి. ఇవి భారత భూభాగంలో 7.25 శాతం విస్తరించి ఉన్నాయి.
Also Read :
0 Comments