Indian Polity in Telugu | Prime Minister Powers and Functions | ప్రధానమంత్రి అధికారాలు - విధులు

Prime Minister Powers and Functions |  ప్రధానమంత్రి అధికారాలు - విధులు

ప్రధానమంత్రి అధికారాలు - విధులు 
Gk in Telugu | General Knowledge | Indian Polity in Telugu 

భారత ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తాడు. ప్రభుత్వంలో ప్రధానమంత్రి స్థానం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. పదవి ప్రకారం రాష్ట్రపతి స్థానం ప్రధామంత్రి కన్న ఉన్నతమైనదిగా గుర్తించినా  రాష్ట్రపతి అధికారాలు కేవలం నామమాత్రంగానే ఉంటాయి. వాస్తవ అధికారాలు ప్రధానమంత్రి మరియు ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం వద్దే కేంద్రీకృతమై ఉంటాయి. 

ప్రధానమంత్రి కార్యనిర్వహణాధికారిగా, ప్రభుత్వాధినేత వ్యవహరిస్తాడు. ప్రధానమంత్రి  రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేస్తాడు. సాధారణ ఎన్నికల అనంతరం మెజార్టీ సీట్లు సాధించిన పార్టీకి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది.  ప్రధానమంత్రి సాధారణంగా 5 సంవత్సరాల పాటు పదవిలో ఉంటాడు. కానీ లోక్‌సభ విశ్వాసం, మెజార్టీపైనే ప్రధానమంత్రి పదవీకాలం ఆధారపడి ఉంటుంది. లోక్‌సభలో ఏ రాజకీయ పార్టీకి నిర్ధిష్టమైన మెజార్టీ సీట్లు లభించనప్పుడు తన విచక్షణాధికారంను ఉపయోగించి ఏర్పరిచే రాజకీయపార్టీ లేదా పార్టీల కూటమి నాయకున్ని ప్రధానిగా నియమించి మెజార్టీ నిరూపించుకోమని కోరతారు. 


Also Read :


➺ అర్హతలు :

  • పార్లమెంటు సభ్యుడై ఉండాలి. 
  • (ఒకవేళ నియమింపబడే సమయానికి పార్లమెంట్‌లో సభ్యత్వం లేకపోతే నియమించిన చివరిరోజు నుండి 6 నెలలలోపు పార్లమెంటు సభ్యుడుగా ఎన్నిక కావాలి) 
  • కనీస వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. 

➺ అధికారాలు - విధులు :

  • ప్రధానమంత్రి మంత్రివర్గాన్ని నిర్మించడంలోను, పునర్మించడంలో, మంత్రులను తొలగింపజేయడంలో ప్రధానమంత్రికి పూర్తి నిర్ణయాధికారి ఉంటుంది. 
  • మంత్రిమండలికి, రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా ఉంటాడు. 
  • రాష్ట్రపతి నిర్వహించవల్సిన అనేక శాసనాధికార నిర్వహణలో ప్రధానమంత్రి ప్రధాన సలహాదారుడు. 
  • లోక్‌సభను రద్దు చేయడంలోను, ఏ సభనైనా ప్రోరోగ్‌ చేయించడంలోనూ, సభలను సమావేశపరచడంలోను, ఆర్డినెన్స్‌లను జారీ చేయించడలోను మొదలైన అనేక శాసనాధికారాలు వాస్తవంగా ప్రధానమంత్రి నిర్ణయంతోనే జరుగుతాయి. ప్రధాని సలహా మేరకే రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేస్తాడు. 
  • పార్లమెంటు సమావేశాలు, దీర్ఘకాలిక వాయిదా మొదలగు అంశాలపై రాష్ట్రపతికి సలహాలిస్తాడు
  • దేశంలో అన్ని ముఖ్య నియామకాలు ప్రధాని నిర్ణయం మేరకు జరుగుతాయి. 
  • ప్రణాళికా సంఘానికి, జాతీయాభివృద్ది మండలికి, జాతీయ సమగ్రత మండలికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జాతీయాభివృద్ది మండలి, జాతీయ సమగ్రత మండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. 
  • మంత్రివర్గ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. 
  • ప్రణాళిక సంఘానికి అధ్యక్షత వహిస్తాడు. 
  • దేశ ప్రధాన ఎన్నికల కమీషనర్‌, ప్రధాన విజిలెన్సు కమీషనర్‌, కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌, న్యాయమూర్తుల నియామాకాల్లో రాష్ట్రపతికి సలహా ఇస్తాడు. 
  • పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించడం, రద్దు చేయడం, అత్యవసర పరిస్థితి విధించడం, యుద్ద ప్రకటన, యుద్ధ విరమణ వంటి విషయాల్లో రాష్ట్రపతికి సలహా ఇస్తాడు. 


Also Read :

Post a Comment

0 Comments