
బహమనీ సుల్తానులు
Bahmani Sultanate in Telugu
బహమనీ సుల్తానులు సుమారు 175 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 1347 సంవత్సరంలో హసన్‌గంగూ / అబ్దుల్ ముజాఫర్ అల్లా ఉద్దీన్ హసన్ బహన్‌షా కర్ణాటకలోని గుల్బర్గాను రాజధానిగా చేసుకొని బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 14వ శతాబ్దంలో ఢిల్లీని పరిపాలిస్తున్న మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజ్యంలో తిరుగుబాట్ల కారణంగా బహమనీ సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. మహ్మద్‌బిన్ తుగ్లక్ గుజరాత్‌లో వచ్చిన తిరుగుబాటును అణచడానికి వెళ్లిన సమయంలో దక్కన్ ప్రాంతంలో తిరుగుబాటు చేస్తున్న అల్లాఉద్దీన్ హసన్ గంగూ 1347 సంవత్సరంలో సొంతంగా స్వాతంత్రం ప్రకటించుకొని బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బహమనీ సామ్రాజ్యం ఏర్పాటులో హసన్ గంగూకు వరంగల్ కాపయ నాయకుల సహాయం చేశాడు. షా అంటే స్వతంత్ర రాజు అని అర్థం. బహమనీ సామ్రాజ్యం 1347 నుండి 1527 వరకు విరాజిల్లింది. బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యానికి సమకాలీకులుగా ఉన్నారు.
➠ అల్లాఉద్దీన్ హసన్ బహమన్ షా
ఇతను గుల్భార్గాను రాజధానిగా చేసుకొని బహమనీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతనికి సికిందర్ ఇసాని (రెండో అలెగ్జాండర్) అనే బిరుదు కలదు. ఇతని కాలంలో రాజధాని అయిన గుల్బర్గాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. హసన్ బహమన్ షా పరిపాలన సౌలభ్యం కొరకు తన సామ్రాజ్యాన్ని గుల్బర్గా, దౌలతాబాద్, బీదర్, బీరార్ అనే నాలుగు తరఫ్‌లు (రాష్ట్రాలు) గా విభజించి తరఫ్‌దార్లు(గవర్నర్లు)ను నియమించి పరిపాలన కొనసాగించాడు. ఇతని పరిపాలన గురించి బుర్హన్-ఎ-మసీర్ అనే గ్రంథంలో వివరించారు. ఇతని గురించి ఫెరిస్టా అనే వ్యక్తి తన రచనలలో వివరించాడు. ఇతను విజయనగర సామ్రాజ్య రాజు అయిన మొదటి హరిహరరాయలను ఓడించి అంతర్వేదిపై ఆధిపత్యాన్ని సాధించాడు. హసన్ బహమన్ షా 1358 సంవత్సరంలో మలేరియా జ్వరంతో మరణించాడు. ఇతని మరణాంతరం ఇతని రెండవ కుమారుడైన మహ్మద్ షా సింహసనాన్ని అధిష్టించాడు.
➠ మహ్మద్ షా (1358-1377)
మహ్మద్ షా 1358 సంవత్సరంలో తన తండ్రి అల్లాఉద్దీన్ హసన్ బహమన్ షా మరణాంతరం బహమనీ సామ్రాజ్య సింహసనాన్ని అధిష్టించాడు. విజయనగర రాజు అయిన మొదటి బుక్కరాయలతో ముద్గల్ కోటకోసం యుద్దం చేసాడు. బుక్కరాయలు ఇతనితో సంధి చేసుకున్నాడు. ఇతని కాలంలో అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేశాడు. ఇతని ఆస్థానంలో 8 మంది మంత్రులతో మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. ఇతను గుల్బార్గాను బడేమసీదును నిర్మించాడు.
➠ రెండవ మహ్మద్ షా
ఇతను శాంతికాముకుడుగా పేరుపొందాడు. ప్రసిద్ద పారశీక కవి అయిన హఫీజ్‌ను తన ఆస్థానానికి ఆహ్వనించాడు. ప్రజలు ఇతనిని రెండో అరిస్టాటిల్‌గా కీర్తించారు. ఇతని కాలంలో రెండో హరిహరరాయలు అంతర్వేది ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు.
➠ ఫిరోజ్‌షా బహమనీ
ఇతను బహమనీ సామ్రాజ్యాన్ని పరిపాలించి రాజులందరిలో గొప్పరాజుగా కీర్తి సాధించాడు. ఇతను తన పేరుమీద భీమా నది ఒడ్డున ఫిరోజాబాద్ అనే నగరాన్ని నిర్మించాడు. ఇతను బహుభాషాకోవిదుడిగా ప్రసిద్ది చెందాడు. ఇతను దౌలతాబాద్‌లో ఖగోళపరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇతను మొదటి దేవరాయలను ముద్గల్ యుద్దంలో ఓడించి మొదటి దేవరాయల కుమార్తెను వివాహం చేసుకొని కట్నంగా బంకాపూర్ ప్రాంతాన్ని పొందాడు. మొట్టమొదటి సూఫి మతగురువైన గేసుదరాజ్ ఇతని కాలంలో బహమనీ సామ్రాజ్యాన్ని సందర్శించాడు.
Also Read :
➠ మొదటి అహ్మద్ షా
ఇతనికి వలి, ఋషి అనే బిరుదులున్నాయి. ఇతని ఆస్థాన కవి పారశిక భాషలో అజార్‌బహమన్ నామా అనే గ్రంథాన్ని లిఖించాడు. ఇతని కాలంలో బహమనీ సుల్తానుల రాజధాని గుల్బార్గా నుండి బీదర్‌కు మార్చడం జరిగింది.
➠ రెండవ అహ్మద్ షా
ఇతనికి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి రెండవ దేవరాయలు సమకాలీనుడిగా ఉన్నాడు. ఇతను రెండవ దేవరాయలతో రెండుసార్లు యుద్దం చేసి ఓడించాడు.
➠ హుమాయున్
బహమనీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో కఠిన హృదయుడుగా పేరుగాంచాడు. ఇతని కాలంలో ముస్లీంలు స్వదేశీ, విదేశీ ముస్లీంలుగా భేదాభిప్రాయాలు జరిగాయి.
➠ మూడో మహ్మద్ షా
ఇతని కాలంలో బహమనీ సామ్రాజ్య అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఇందుకు ప్రధాన కారణం ప్రధానమంత్రి మాముద్ గవాన్‌ను ప్రధానమంత్రిగా నియమించడం. ప్రధాని అయిన మాముద్ గవాన్ బహమనీ రాజ్యాన్ని శత్రువుల నుండి నిరంతరం రక్షించాడు. గవాన్ పారశీక భాషలో పండితునిగా ఉండేవాడు. బహమనీ రాజ్యాంలో విద్యాభివృద్దికి బీదర్‌లో పెద్ద మదర్‌సాను నిర్మించి అందులో 3000 గ్రంథాలతో గ్రంథాలయాన్ని నిర్మించాడు. గవాన్, సుల్తాన్ మీద కుట్ర చేస్తున్నాడని మహ్మద్‌షాను నమ్మించి గవాన్‌కు మరణశిక్ష విధించేలా దక్కను ముస్లీంలు గవాన్‌మీద కుట్ర పన్నడంతో 1481లో గవాన్‌ను ఉరితీయడం జరిగింది. గవాన్ మరణంతో రాజ్యం పతనానికి గురై విజయనగర రాజులు అంతర్వేదిని ఆక్రమించారు. కోండవీడు గజపతులు స్వాధీనం చేసుకుంది. ఇతని కాలంలో బహమనీ సామ్రాజ్యం ఎంత అభివృద్ది చెందినతో అంత పతనస్థాయికి చేరుకుంది. ఇతని కాలంలో నికిటిన్ అనే రష్యా దేశ వర్తకుడు మూడవ మహ్మద్ ఆస్థానాన్ని సందర్శించాడు. నికిటిన్ తన రచనల్లో సర్దారుల విలాస జీవితాన్ని, పేదల దుర్భర పరిస్థితిని వివరించడం జరిగింది. ఇతని కాలంలో 4 తరఫ్‌లను 8 తరఫ్‌లుగా మార్చి పరిపాలించాడు. ఇతని కాలంలో విదేశీ వ్యాపారం అభివృద్ది చెందింది.
బహమనీ సామ్రాజ్య చివరి పాలకుడైన కలిముల్లా కాలంలో భారతదేశం మీదికి బాబరు దండెత్తి వచ్చి మొగలాయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కలీముల్లా బీదర్ విడిచి వెళ్లి బీజాపూర్ పారిపోయి చివరకు అహ్మద్‌నగర్ చేరి 1528లో మరణించాడు. దీంతో బహమనీ సామ్రాజ్యం అంతరించింది.
కలీముల్లా కాలంలో బహమనీ సామ్రాజ్య 5 భూభాగాలుగా విడిపోవడం జరిగింది. వీటిని దక్కన్ భూభాగాలుగా పిలుస్తారు.
రాజ్యం | సం॥ | స్థాపకుడు | వంశం |
---|---|---|---|
బీరార్ | 1490 | ఫతేఉల్లా ఇమాద్‌షా | ఇమాద్‌షా |
బీజాపూర్ | 1490 | యూసఫ్ ఆదిల్‌షా | అదిల్‌షాహి |
అహ్మద్‌నగర్ | 1490 | మాలిక్ అహ్మద్ | నైజామ్ షాహి |
గోల్కొండ | 1512 | కులీకుతుబ్ షా | కుతుబ్‌షాహి |
బీదర్ | 1527 | అమీర్ ఆలీబరీద్ | బరీద్ షాహీ |
Related Posts :
- ఢిల్లీ సుల్తానులు
- మొగల్ సామ్రాజ్యం
- కుతుబ్ షాహీ సామ్రాజ్యం
- కాకతీయ సామ్రాజ్యం
- అసఫ్‌జాహీ సామ్రాజ్యం
- శాతవాహన సామ్రాజ్యం
0 Comments